Ram charan dropped out dussehra race

Ram charan tej, mahesh babu, Aagadu movie, Govindudu Andari Vaadele, Dussehra Race

Ram charan dropped out Dussehra Race. Aagadu and Govindudu Andari Vaadele were believed to witness another fierce battle of heroes at the box office.

రామ్ చరణ్ ఎందుకు వెనక్కి తగ్గినట్లో ?

Posted: 05/16/2014 06:43 PM IST
Ram charan dropped out dussehra race

గత కొంత కాలంగా టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద పోటీ పడుతున్నారు స్టార్ హీరోలు మహేశ్ బాబు, రామ్ చరణ్ తేజ్. పోయిన సంవత్సరం మహేశ్ సీ.వా.సి.చె. సినిమా, రామ్ చరణ్ ‘నాయక్ ’ సినిమాలు పోటాపోటీగా విడుదలయ్యాయి. ఈ సంవత్సం మహేశ్ ‘వన్ నేనొక్కడినే ’, రామ్ చరణ్ ‘ఎవడు ’ చిత్రాలు విడుదల అయ్యాయి. కానీ ఈ సారి మహేశ్ బాబు విజయం ముంగిట బోల్తా కొట్టాడు.

రామ్ చరణ్ ‘ఎవడు ’ కలెక్షన్స్ లో రికార్డులు క్రియేట్ చేయడమే కాకుండా, ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి సారి ఇద్దరికి విజయాలు దక్కగా, రెండోసారి రామ్ చరణ్ కే విజయం దక్కినా, మూడోసారి మాత్రం మహేశ్ తో పోటీ పడటానికి సిద్దంగా లేడని తెలుస్తుంది. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న ‘గోవిందుడు అందరివాడేలే', మహేష్ బాబు నటిస్తున్న ‘ఆగడు' చిత్రాలను దసరా కానుకగా సెప్టెంబర్ 26వ తేదిన విడుదల చేయాలని భావించారు.

కానీ ఇటీవలి పలు కారణాల వల్ల రామ్ చరణ్ సినిమా షూటింగుకు బ్రేక్ పడటంతో ఈ సినిమాను సెప్టెంబర్ లో విడుదల చేసే అవకాశాలు లేవని అంటున్నారు. ఈసారి సింగిల్ గా వస్తున్న మహేశ్ బాబు ‘దూకుడు ’ అంత హిట్టు ‘ఆగడు ’తో కొడతాడో లేదో చూడాలి.

మహేష్ నటిస్తున్న ‘ఆగడు' చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తుండగా, 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్ నిర్మిస్తోంది. తమన్నా హీరోయిన్. యాక్షన్ ఎంటర్టెనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చరణ్ నటిస్తున్న చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles