Rajanikanth busy in other movie for his fans

Rajanikanth busy in other movie for his fans, Kochadaiyan movie, Rajanikanth Linga movie, Rajanikanth fans waiting for good movie

Rajanikanth busy in other movie for his fans

అభిమానులకోసం రజనీకాంత్ చకచకా మరో చిత్రం?

Posted: 05/13/2014 06:51 PM IST
Rajanikanth busy in other movie for his fans

రజనీకాంత్ సినిమా వచ్చి చాలా రోజులయింది.  రోబో హిట్ తర్వాత రజనీ సినిమాకోసం ఆయన అభిమానులు అర్రులుచాచుకుని వున్నారు.  కానీ ఆయన అనారోగ్యం వలన ఆయన అనుకున్న సినిమాలను అటకెక్కించటం జరిగింది.  అయితే కొచ్చాడియన్ సినిమాలో అంతా యానిమేషనే కాబట్టి ఆయన కూతురు సౌందర్య దర్శకత్వంలో ఆ సినిమా రజనీ ఎక్కువ శ్రమ పడకుండానే తయారైంది.  కానీ యానిమేషన్ ఎంతో శ్రమతో కూడుకున్న పని కాబట్టి అందులో నిపుణులు, సిద్ధహస్తులు రజనీకి బదులుగా ఆ శ్రమపడ్డారు.  

ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ప్రియతముడు వస్తాడు వస్తాడనుకుంటే తీరా తలుపు కొట్టిన తర్వాత తీసి చూస్తే ఎదురుగా ఆ మనిషి చిత్ర పటం మాత్రమే వస్తే ఎలా ఉంటుంది.  అది ఎంత పెద్దగా ఉన్నా, ఎంత ఖర్చుతో కూడుకున్నదైనా, ఎంత ఆధునిక సాంకేతిక పరాకాష్టలతో తయారుచేసిందైనా మనసుకి హాయిని కలిగిస్తుందా.  రజనీ అభిమానులు అలాగే భావిస్తారేమోనని డిస్ట్రిబ్యూటర్లు భయపడుతున్నారు.  

అందువలన మిస్ అయిపోయిన ఆ పర్సనల్ టచ్ ని ఇవ్వటం కోసమే రజనీ కాంత్ మరో సినిమాను చకచకా పూర్తి చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.  రజనీకాంత్ కి తన అభిమానుల మీద ఎంత ప్రేమో దీనితో అర్థమౌతోంది.  వాళ్ళని నిరుత్సాహపరచటం ఆయనకు ఇష్టముండదు. 

రజనీకాంత్ లింగా హైద్రాబాద్ లో

మైసూర్ లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న రజనీ కాంత్ తదుపరి చిత్రం లింగా రెండవ షెడ్యూల్ చిత్రీకరణ కోసం హైద్రాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీకి వస్తోంది.  రజనీకాంత్ తండ్రి పేరు రామోజీ అవటం వలన రామోజీ ఫిల్మ్ సిటిలో కొంత భాగమైనా చిత్రీకరణ చెయ్యాలన్న సెంటిమెంట్ రజనీ కాంత్ కి వుందట.  

రజనీకాంత్ సన్నిహిత మిత్రుడు కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న లింగా చిత్రంలో రజనీకాంత్ సరసన ఉత్తరాది అందాల తార సోనాక్షి సిన్హా, దక్షిణాదిలో సెటిలైన అనుష్క శెట్టి నటిస్తున్నారు.  

 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles