Renu desai comments on pawan kalyan

renu desai, pawan kalyan, badri movie, actress Renu Desai, renu desai comments on pawan kalyan, tammudu movie, pawan wife renu desai.

renu desai comments on pawan kalyan

పవన్ తో ‘తొలిసారి ’ నా అనుభవం

Posted: 04/21/2014 10:18 AM IST
Renu desai comments on pawan kalyan

ఎవరికైన ‘తొలిసారి’ అనుభవం అనే పదం బాగా గుర్తుంటుంది.. ఆ తొలిసారి చూపులోనే  అనుబంధం ఏర్పాడుతుంది. తొలిసారిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూసిన  రేణుదేశాయ్ మనసు పులకించిపోయింది. అలా పవన్ తో తొలిసారి తొలిచూపు జరిగి నేటికి పథ్నాలుగేళ్లు పూర్తయింది.  

తన తొలి చూపులను రేణుదేశాయ్ గుర్తు చేసుకుంటూ ఫేస్ బుక్ లో పోస్టు చేసింది.  తొలిసారిగా బద్రి చిత్రంలో నటించిన ఈ జంట అనంతరకాలంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. బద్రి చిత్రం విడుదలై నేటికి (20 ఏప్రిల్) పధ్నాలుగేళ్లు పూర్తయింది. 

1999 జూన్ 6న రామానాయుడు స్టూడియోలో పవన్‌కల్యాణ్ ను మొదటిసారి చూశాను. రేణూదేశాయ్ అప్పుడాయన తమ్ముడు సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ ఫైట్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. 

బద్రి చిత్రంలో తొలుత సరయు పాత్రకు నన్ను, వెన్నెల పాత్రకు సిమ్రాన్‌ను అనుకున్నారు. డేట్స్ సమస్యల వల్ల సిమ్రాన్ తప్పుకుంది. దాంతో నేను వెన్నెల పాత్రను చేయాల్సివచ్చింది. మిగతా కథంతా మీకు తెలిసిందే అంటూ రేణూదేశాయ్ ఫేస్‌బుక్‌లో తెలిపింది.

ఆర్ఎస్  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles