Balakrishna legend movie join the 50 crore club

Legend Movie, 50 Crore Club, Legend, Nandamuri Balakrishna, Boxoffice Collections, Lend Movie Total Collections, Legend World Wide Share, Legend Movie Budget, legend, legend box office, telugu box office, balakrishna, boyapati srinu

Nandamuri Balakrishna Telugu movie Legend has done superb collection and crossed Rs 50 crore at Box Office in 20 days. Legend third week business report

బాలయ్య కెరియర్లో అరుదైన రికార్డు

Posted: 04/17/2014 02:56 PM IST
Balakrishna legend movie join the 50 crore club

నందమూరి నట సింహం బాలయ్యకు ఈ సంవత్సం బాగా కలిసి వచ్చింది. బోయపాటి శీను - బాలయ్య కాంబినేషనల్లో వచ్చిన లెజెండ్ సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా, నందమూరి వంశంలో ఇంత వరకు ఏ హీరో సాధించని అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. తొలి వారంలోనే తొలివారంలోనే 33 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి రికార్డ్‌ క్రియేట్ చేసిన ఈ సినిమా అందరి అంచనాలను నిజం చేస్తూ యాభై కోట్ల కబ్బు మార్కును దాటింది.

నందమూరి నటసింహం బాలకృష్ణ అభినయం, ఆయన పలికిన సంభాషణలు, బోయపాటి శ్రీను దర్శకత్వ ప్రతిభ ఈ సినిమా విజయానికి తొడయ్యాయి. బాలకృష్ణ నుంచి అభిమానులు ఆశించే అంశాలన్నీ ఇందులో ఉండడంతో, ప్రేక్షకులు దీనికి బ్రహ్మరథం పడుతున్నారు. గత కొంత కాలంగా సరైన హిట్టు లేక అల్లాడుతున్న పరిశ్రమకు ఈ సినిమా విజయం ఊరటనిచ్చింది.

వారాహి చలనచిత్రం మరియు 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా తెరకెక్కిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ అద్బుతమైన సంగీతాన్ని ఇచ్చారు. మొత్తానికి బాలయ్య సినిమా యాభై కోట్ల క్లబ్బులో చేరడంతో ఆయన అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles