Pawan janasena party logo and party song

pawan janasena party, Power Star Pawan Kalyan, new political party Jana Sena, pawan janasena party logo, party song,

pawan janasena party logo and party song

పవన్ ‘జనసేన’ పార్టీ పాట-జెండా లోగో అదుర్స్ ?

Posted: 03/13/2014 05:46 PM IST
Pawan janasena party logo and party song

పదవికోసం కాదు.. ప్రజల కోసం ఉదయిస్తున్న పవన్  ‘జనసేన’ పార్టీ. తెలుగు ప్రజలు  జనసేన పార్టీకోసం  ఎదురుచూస్తున్నారు.  పవన్ కళ్యాణ్ ’జనసేన పార్టీ’ ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

రేపు హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్ లో పవన్ పార్టీ ప్రకటన చేయనున్న నేపధ్యంలో.. ఆపార్టీ ప్రచారగీతం తాజాగా బయటకు వచ్చింది. ఈ రోజు ఫాన్స్ భేటి అయిన తర్వతా ఈ ప్రచార గీతం ను రిలీజ్ చేసినట్లు సమాచారం.

మరో వైపు పార్టీ లోగో కుడా బయటకు వచ్చింది. లోగోను తెలుపు, ఎరుపు రంగులతో డిజైన్ చేశారు. పార్టీ లోగో కు సంభందించి పూర్తి వివరణ ప్రెస్ మీట్ లో వెల్లడించనున్నారు.

పవన్ జనసేన పార్టీ లోగోను కూడా రిలీజ్  చేయటం జరిగింది.  అయితే  జెండాలో  ఎరుపు రంగు, తెలుపు రంగులతో నిండిపోయింది.  విప్లవానికి ఎరుపు రంగు, శాంతికి తెలుపు  రంగు.  ఈరెండు కలయికతో  కూడిన  జెండాను  పవన్  కళ్యాణ్  ప్రజల మద్య కు తెస్తున్నాడు. అంతేకాకుండా ఈ జెండాల షడ్ చక్రం కలిగి ఉండటం అందర్ని విశేషంగా ఆకట్టుకుంటుంది.  ఆరు కోణాలు కలిగిన స్టార్ . 

తెలుపు రంగు :  తెలుపు అంటే  శాంతికి  చిహ్నం,  వేలాది  సంవత్సరాలుగా  భారత దేశంలో  నెలకొన్న శాంతి, స్థిరత్వాన్ని  ఈ తెలుపు  రంగు ప్రతిభింబిస్తుందని , అందుకే  తెలుపు రంగును  పవన్ ఎంచుకున్నట్లు  తెలుస్తోంది. 

ఎరుపు రంగు:  జెండాలో కొంత భాగం ,  మద్య ఉన్న లోగో  ఎరుపు రంగు కలిగి ఉన్న విషయం తెలిసిందే.  అయితే  ఎరుపు రంగు  విప్లవానికి  ప్రతీక. మార్పు రావాలంటే  విప్లవ మార్గంలోనే మార్పు వస్తుందని  పవన్ నమ్మకం. అందుకే ఎరుపు రంగును తీసుకున్నట్లు తెలుస్తోంది. 

జెండా మద్యలో లోగో, లోగో మద్యలో చుక్క :  జెండా మద్యలో   ఉన్న చుక్క  ప్రతి  మనిషి ఆత్మకు ప్రతీక, ఆ ఆత్మ   యెక్క నిజమైన రూపమే  మనిషి. 

ఇక షడ్ చక్రం :  ఆరు కోణాలు కలిగిన షడ్ చక్రం .  జన సేన పార్టీ   అందరిది అనే విధంగా ఉంది. 

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles