Pavan gabbar singh 2 start in march

Pavan Gabbar Singh 2 from March, Gabbar Singh 2 from March?,Gabbar Singh 2 story,Gabbar Singh 2 budget,Gabbar Singh 2 heroine,Gabbar Singh 2 leaked story,Gabbar Singh 2 movie wiki,pawan kalyan

Pavan Kalyan is presently not in a mood to go before camera and lights and he intends to have a break and have some fun time.

మళ్ళీ వాయిదా పడిన పవన్ సినిమా

Posted: 01/22/2014 10:12 AM IST
Pavan gabbar singh 2 start in march

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల నటించిన ‘అత్తారింటికి దారేది ’ సినిమా సెట్స్ పై ఉండగానే  ‘గబ్బర్ సింగ్ -2’ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి, దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా చేయమని చెప్పాడు. ‘అత్తారింటికి ’ విడుదల తరువాత ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని అంతా భావించారు.

కానీ ఆ సినిమా విడుదల అయ్యి నాలుగు నెలల సమయం గడిచినా ‘గబ్బర్ సింగ్ -2’ సెట్స్ పైకి వెళ్ళలేదు. గత కొన్ని రోజుల నుండి ఇదిగో అదిగో అంటూ ఊరిస్తూ వస్తున్నారు. ఇటీవల ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళుతుందని అన్నారు. కానీ ఇప్పుడని ఇంకాస్త వెనక్కి వెళ్లినట్లు సమాచారం. ఇప్పటి వరకు కథానాయిక ఎంపిక పూర్తి కాలేదు.

ఈ కారణం చేతనే ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు చెబుతున్నారు. కారణాలు ఏమైనా పవన్ ఈ సినిమాకు ఇంత టైం తీసుకోవడం చూస్తుంటే దర్శకుడి పై పూర్తి నమ్మకం లేకనే వాయిదా వేస్తూ వస్తున్నాడనే ప్రచారం మొదలైంది. అన్నీ సవ్యంగా జరిగితే మార్చిలో సెట్స్ పైకి వెళుతుందని చెబుతున్నా, అది జరిగినప్పుడు చూద్దాం అంటున్నారు సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles