Ntr all movies to release in japan

Jr NTR starrer Baadshah, Rajinikanth, Hero NTR all movies to release in Japan

Youngtiger NTR craze in Japan.Some of news channel telecasted some programs by projecting NTR work is the most sought after next to Rajinikanth among Japaneese .

జూనియర్ ఎన్టీఆర్ కి పరాయి దేశంలో హవా

Posted: 01/10/2014 08:53 PM IST
Ntr all movies to release in japan

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ కి మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా జపాన్ లో. సౌత్ ఇండస్ట్రీలో, బాలీవుడ్ లో ఉన్న హీరోలందరికంటే రజినీ స్టైల్ నే ఎక్కువగా ఇష్టపడతారు జపాన్ వాసులు. ఇప్పుడు మరీ రజినీకాంత్ స్థాయిలో కాకున్నా ఆయన తరువాత స్థానంలో జపాన్ వాసులు ఇష్టపడుతున్నది

మన జూనియర్ ఎన్టీఆర్ నే. అవును ఈ బుడ్డోడికి అక్కడున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదులెండీ..ఇంత వరకు ఇతగాడి సినిమాలు ఒక్కటి కూడా అక్కడ విడుదల కాలేదు కదా ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటనేగా మీ డౌట్. జపాన్ లో ఫ్యూజీ అనే ఓ ఛానెల్ ఎన్టీఆర్ మీద ఓ డాక్యుమెంటరీ తయారుచేసి కొన్నాళ్ళ క్రితం ప్రసారం చేశారు. అక్కడ నుండి బుడ్డోడి హవా మొదలైందట. రాను రాను ఎన్టీఆర్ సినిమాలలోని పాటలు అక్కడ పాపులర్ కావడం..

ముఖ్యంగా ఎన్టీఆర్ డాన్సుకు అక్కడ ప్రేక్షకులు ఫిదా అయిపోవడంతో ఇప్పుడు అక్కడి ఓ పాపులర్ ప్రొడక్షన్ సంస్థ ఎన్టీఆర్ బాద్షా సినిమా హక్కులకు కొని డబ్బింగ్ ప్రయత్నాలను మొదలు పెట్టిందట. అంతేకాదు ఇతగాడి తెలుగు సూపర్ హిట్ సినిమాలన్నీ కూడా అక్కడ డబ్ చేసే ఆలోచనలో ఆ సంస్థ ఉందట. గత కొంత కాలం నుండి సరైన హిట్ సినిమాలు లేక కాస్తంత బాధలో ఉన్న ఎన్టీఆర్ కి ఇది ఊరట కలిగించే విషయమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles