Nag is game to be a tv show host

Nagarjuna TV show, Nagarjuna TV , Nagarjuna movies , Nagarjuna films, actor Nagarjuna

Tollywood stars are making a beeline to cash in on their popularity on TV, rarely has a big matinee idol done the same.

బుల్లితెర పై నాగార్జున రియాల్టీ షో

Posted: 01/05/2014 07:03 PM IST
Nag is game to be a tv show host

టాలీవుడ్ లో మన్మథుడిగా పేరు తెచ్చుకొని, ఇప్పటికీ యంగ్ స్టర్ గా కనిపించే హీరో నాగార్జున బాలీవుడ్ హీరోల బాటలో నడవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. హీరోగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈయన నిర్మాతగా కూడా మారి మంచి సక్సెస్ సాధించాడు. టీవీ సీరియళ్ళు, సినిమాలు నిర్మిస్తున్న నాగార్జున మనస్సు వెండితెర నుండి బుల్లితెరకు మళ్లినట్లుంది.

అందుకే బాలీవుడ్ హీరోల్లాగా లైవ్ షో లు చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇటీవల ఓ సందర్భంగా మాట్లాడుతూ తనను తాను బుల్లితెర పై చూసుకోవాలని ఉందని అందుకే త్వరలో ఓ రియాల్టీలో నటించాలని ఉందని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే మా టీవీలో షేర్ ఉన్న నాగ్ , ఆ ఛానల్ లోనే రియాల్టీ షోకి ప్లాన్ చేస్తున్నాడు.

ఆ ప్రయత్నాలు కూడా మొదలు పెట్టాడు. తన స్థాయికి తగ్గట్లు, ప్రేక్షకులు మెచ్చే విధంగా ఈ షో ఉంటుందని ప్లాన్ చేస్తున్నారట. మరి వెండితెరను ఏలిన బుల్లితెర పై ఏ మాత్రం రాణిస్తాడో చూడాలి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles