Mohan babu varma movie ottu

Mohan Babu Varma movie Ottu, Hero Mohan Babu, Director Ram Gopal Varma, movie Ottu, movie Sarkar, Political movie Ottu

Mohan Babu Varma movie Ottu

మోహన్ బాబుతో ఒట్టు పెట్టిస్తున్న వర్మ

Posted: 01/06/2014 01:11 PM IST
Mohan babu varma movie ottu

రాయలసీమ ఫాక్షన్ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ హిట్ హిందీ చిత్రం సర్కార్ లాంటి కథనంతో సాగే చిత్రం తెలుగులో మోహన్ బాబుతో మొదలుపెడుతున్నారు వర్మ.  దానికి ప్రస్తుతం ఒట్టు అనే టైటిల్ ని పెట్టారు. 

ప్రస్తుతం మోహన్ బాబు మీద జరుగుతున్న పాట సన్నివేశం ఆ పాత్ర ఔచిత్యాన్ని తెలియజేసేవిధంగా ఉంది.  ధైర్యసాహసాలు, నిజాయితీ, నిర్బయత్వం లాంటి ఆ పాత్ర గుణగణాలను కొనియాడుతూ సాగుతుంది ఆ గానం. 

ఈ చిత్రంతో మోహన్ బాబు రాజకీయ నాయకుడి ముద్రవేయించుకునే అవకాశం ఉంది.  కామెడీ, దుష్టపాత్రలనుంచి హీరో గా ఎదిగి యాక్షన్ హీరో పాత్రలలో పేరు తెచ్చుకున్న మోహన్ బాబు కారెక్టర్ యాక్టర్ గా కూడా పేరుగాంచారు.  ఇప్పుడు రాజకీయ నాయకుడి పాత్రలో ఆయన రాణించినట్లయితే నిజజీవితంలో కూడా రాజకీయ రంగ ప్రవేశం చెయ్యటానికి సానుకూలత ఏర్పడవచ్చని అనిపిస్తోంది. 

రాజకీయాలలో ప్రవేశించటానికి కొంతకాలంగా మొగ్గు చూపిస్తూవస్తున్న మోహన్ బాబు సరైన సమయం కోసం వేచి చూస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. 
ఆ సమయం ఈ సినిమాతో ఆయనకు సంప్రాప్తించవచ్చేమో

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles