Ranjitha dons saffron now ma anandmayi

Actress Ranjitha, Ma Anandmayi, Bidadi Dhyanapeet Ashram, Ranjitha, Sanyasa Deekshe, Swami Nithyananda, Tamil film actress.

Tamil film actress Ranjitha has now assumed the name Maa Anandamayi.

రాసలీలల రంజిత – ఇక సన్యాసి రంజిత

Posted: 12/28/2013 08:53 AM IST
Ranjitha dons saffron now ma anandmayi

స్వామి నిత్యానందతో రాసలీలు నడిపిన ఆయన శిష్యురాలు, సినిమా నటి అయిన రంజిత సన్యాసం పుచ్చుకుంది. స్వామి కార్యం సకార్యంగా పూర్తి చేసి ఆమెకు పరమ భక్తురాలిగా పేరు తెచ్చుకున్న ఈమె వ్యవహారం అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపింది.

ఆ సంఘటన తరువాత వెండితెరకు దూరం అయ్యి నిత్యానంద సేవలో మునిగితేలుతున్న ఈమె బెంగుళూరు శివారులోని బిడిది సమీపంలోని ధ్యాన పీఠంలో నిత్యానంద సమక్షంలోనే సన్యాసం తీసుకుంది. సన్యాసిన మారిన అనంతరం ఈమె పేరును ‘మా ఆనందమయి ’గా మార్చారు. నిన్న జరిగిన ఈ వేడుకలో ఈమెతో పాటు మరో 40 మంది కూడా సన్యాసులుగా మారారు. అయితే సకల భోగాలు అనుభవిస్తున్న రంజిత సన్యాసం తీసుకోవడం పై ధర్మ పీఠాధిపతులు మండిపతున్నారు.నటి రంజిత సన్యాసం తీసుకోవడం చాలా ఆశ్చర్యానికి గురి చేసిందని శ్రీజగద్గురు బసవ ధర్మ పీఠాధ్యక్షురాలు మాత మహాదేవి అన్నారు.

సన్యాసం తీసుకోవడమంటే అంత సులువు కాదని, సేవ చేయడానికి సిద్ధం కావాలని, అన్ని త్యాగం చేయాల్సి ఉంటుందని తెలిపారు. అన్ని భోగాలు అనుభవిస్తూ సన్యాసి అని చెప్పుకోవడం సాధ్యం కాదని గుర్తు చేశారు. అసలు నిత్యానంద ఆశ్రమంలో ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియాల్సిన అవసరముందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles