Venkatesh as home minister in radha movie

Victory Venkatesh , home minister role, radha movie, venkatesh politician, maruthi,home minister,radha

Venky is playing the role of a politician, who happens to be a Home Minister in radha movie.

హోం మినిస్టర్ గా వెంకటేష్

Posted: 12/18/2013 05:59 PM IST
Venkatesh as home minister in radha movie

’ఆడవారి మాటలకు అర్థాలే వేరు ’ అని ఓ సినిమా కవి రాస్తే దానినే టైటిల్ గా పెట్టుకొని ఓ సినిమా చేసేసిన విక్టరీ వెంకటేష్ మాటలకు కూడా అర్థాలు కూడా వేరని నిరూపించబోతున్నాడు. ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్య్వూలో  మాట్లాడుతూ... తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, అదో మురికి కూపం, అందులోకి వెళితే నిజాయితీగా ఉండటం కష్టం అని చెప్పిన వెంకటేష్ ఇప్పుడు అదే రొంపిలోకి దిగబోతున్నాడు.

ఈయన రాజకీయాల్లోకి వచ్చేది రియల్ లైఫ్ లో కాదండీ... రీల్ లైఫ్ లో . త్వరలో ఈయన యంగ్ దర్శకుడు మారుతి దర్శకత్వంలో చేయబోతున్న ‘రాధ’ చిత్రంలో హోంమంత్రిగా కనిపించబోతున్నాడని సమాచారం. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ప్రతిబింబించే విధంగా ఈ చిత్రం రూపుదిద్దుకోబోతుందని, స్టోరీకి తగ్గట్లు హోంమంత్రి పాత్ర అయితేనే బాగుంటుంది కాబట్టి వెంకీ అలా నటించడానికి ఒప్పుకున్నాడని అంటున్నాడు. ఇప్పటికే రెండు లేడీ పేర్లతో తీసిన సినిమాలు హిట్టవ్వడంతో ఈ సినిమాకు ‘రాధ ’ అనే టైటిల్ ని పెట్టారని అంటున్నారు.

చాలా రోజుల నుండి మంచి హిట్ కోసం చూస్తున్న వెంకీకి ఈ చిత్రం ఏ మాత్రం పేరు తెస్తుందో చూడాలంటున్నారు. ఇక పోతే ఈ సినిమాకు ఇప్పటి వరకు కథానాయిక మాత్రం ఎంపిక కాలేదు. సినిమా మొత్తం పూర్తిగా రాజకీయాలే కాకుండా ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా కూడా ఉండనుందని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles