Aishwarya rai again romance with rajini

Aishwarya rai again romance with Rajini, Aishwarya Rai To Romance Rajinikanth Again, rajanikanth,Aishwarya rai,kollywood, Rajni and Shankar in discussion for Endhiran-2, Endhiran, Enthiran, Rajni, Rajinikanth, Shankar, Enthiran 2, Robot - 2

Aishwarya rai again romance with Rajini, Aishwarya Rai To Romance Rajinikanth Again, rajanikanth,Aishwarya rai,kollywood, Rajni and Shankar in discussion for Endhiran-2, Endhiran, Enthiran, Rajni, Rajinikanth, Shankar, Enthiran 2, Robot - 2

ఐశ్వర్యారాయ్ మరోసారి రజినీతో రొమాన్స్

Posted: 12/07/2013 09:39 AM IST
Aishwarya rai again romance with rajini

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్, ప్రపంచ అందాల సుందరి ఐశ్వర్యరాయ్ ని వదలేకపోతున్నాడా ? ఆమె కూడా రజినీతో రొమాన్స్ కి రెడీ అవుతుందా ? అంటే కోలీవుడ్ వర్గాల నుండి అవుననే సమాధానం వస్తుంది. గతంలో వీరిద్దరు కలిసి నటించిన ‘ఎందిరన్ ’ (రోబో) రికార్డులు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా తరువాత రజినీ ‘కొచ్చాడయాన్ ’ చిత్రం చేస్తున్నాడు.

ఇప్పుడా చిత్రం విడుదలకు సిద్దమౌవుతోంది. దీని తరువాత రజినీ సినిమా ఏంటి ? అసలే అనారోగ్య కారణాలతో బాధ పడుతున్న ఆయన సినిమా నుండి తప్పుకొని రెస్ట్ తీసుకుంటాడా ? అంటే కాదు ఆయన తరువాతి చిత్రం ఉంటుందని అదీ స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలోనే ‘ఎందిరన్ ’ కి సీక్వెల్ ఉంటుందనే వార్తలు ఇప్పుడు కోలీవుడ్ లో సంచరిస్తున్నాయి. ఈ సినిమాలో మళ్ళీ హీరోయిన్ గా ఐష్ నే తీసుకోవాలని దర్శకుడు భావిస్తున్నాడట.

ఓ పాపకు జన్మనిచ్చిన తరువాత సినిమా వెండితెర పై కనిపించని ఐష్ ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు.ఈ చిత్ర వివరాలను రజనీకాంత్ పుట్టిన రోజు డిసెంబర్ 12న వెల్లడించాలని ముందు నిర్ణయించుకున్నా ఇప్పుడు కోచ్చడయాన్ చిత్రం విడుదలానంతరమే నూతన చిత్ర వివరాలను ప్రకటించాలన్న రజనీ భావనతో చిత్ర దర్శక నిర్మాతలు ఏకీభవించినట్లు సమాచారం.  ప్రస్తుతం శంకర్ చేస్తున్న ‘ఐ’ విడుదల తరువాత ఈ చిత్రం సెట్స్ కి వెళ్ళనుందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles