Rajinikanth to share the screen with dhanush

Rajinikanth to Share Screen With Dhanush, Rajinikanth-Dhanush movie, Anand L Rai movie, Raanjhnaa movie,

Superstar, the film is said to include Dhanush to share the screen with the mega star. Famous of his romantic runaway hits like Raanjhnaa and Tanu Weds Manu.

ధనుష్ కోసం రజినీ సాహసం చేస్తాడా ?

Posted: 11/16/2013 11:45 AM IST
Rajinikanth to share the screen with dhanush

సౌత్ ఇండియా సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న రజినీకాంత్ త్వరలో తన అల్లుడితో కలిసి బాలీవుడ్ లో మల్టీ స్టారర్ చిత్రం చేయబోతున్నాడనే వార్తలు ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. కెరియర్ మొదట్లో కొన్ని బాలీవుడ్ చిత్రాల్లో నటించి అలరించిన రజినీకాంత్ గత రెండు దశాబ్దాలుగా బాలీవుడ్ చిత్రాలకు దూరంగా ఉంటూ కోలీవుడ్, టాలీవుడ్ లలోనే నటిస్తున్నాడు.

ఇప్పుడు తమిళంలో స్టార్ డమ్ సంపాదించుకున్న తన అల్లుడు ధనుష్ ఇటు బాలీవుడ్ లో కూడా నటిస్తున్నాడు. ఈయన హిందీలో ‘రాన్ - జానా ’ చిత్రంలో నటించి మంచి విజయాన్ని కూడా సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆనంద్ ఎల్ రాయ్  మళ్ళీ ధనుష్ కోసం ఓ కథ సిద్ధం చేసుకున్నాడని, ఇందులో ఓ ముఖ్యపాత్ర కూడా ఉంటుందట.

అందుకోసం సరైన హీరో రజినీకాంత్ అని ఆయన భావిస్తున్నాడట. రజినీని ఇప్పించడానికి ధనుష్ తో రికెమెండ్ చేయిస్తున్నాడట ఆనంద్. మరి అల్లుడి కోసం ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకుంటాడో లేదో చూడాలంటున్నారు బాలీవుడ్ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles