Race gurram movie out of sankranthi race

Yevadu,Ram charan,Race Gurram release,Allu Arjun, Mahesh Babu 1 movie, Sankranthi race, Allu Arjun, Surender Reddy film,

Allu Arjun Race Gurram will also be in race for a festive season release. However, this film is unlikely to release for Pongal as per our sources.

గుర్రం రేసులో నిలవడం లేదా ?

Posted: 11/14/2013 10:15 AM IST
Race gurram movie out of sankranthi race

గత కొంత కాలం నుండి టాలీవుడ్ లో ఏ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో చెప్పలేని పరిస్థితి. ముందు ప్రకటించిన విడుదల తేదీ ప్రకారం ఏ సినిమా విడుదల కావడం లేదు. కారణం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు కావచ్చు... పండగ సీజన్లలో విడుదల చేసి పెట్టిన పెట్టుబడి రాబట్టుకోవాలనే దర్శక నిర్మాతల ఆలోచన కావచ్చు కానీ సినిమాలను వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే రానున్న సంక్రాంతికి సీజన్ ని చొటా బడా సినిమాలు టార్గెట్ చేశాయి. ఈ సీజన్ లో సినిమాలను విడుదల చేయడానికి పలువురు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతిని సెంటిమెంటుగా భావించే మహేష్ ‘1’ సినిమాను జనవరి 10న విడుదల చేయాలని ప్లాన్ చేస్తుండగా. నితిన్ ‘హార్ట్ ఎటాక్ ’ సాయి ధర్మతేజ్  ‘రేయ్ ’ సినిమాను కూడా సంక్రాంతి బరిలో నిలపాలని ట్రై చేస్తున్నారు. ఇఫ్పటికే పలుసార్లు వాయిదా వేస్తూ వచ్చిన మెగా హీరో చరణ్ సినిమా ‘ఎవడు ’ ను నిర్మాత దిల్ రాజు భారీ స్థాయిలో విడుదల చేయాలని చూస్తున్నాడు. అదే కాకుండా అల్లు అర్జున్ సినిమా ‘రేసు గుర్రాన్ని ’ కూడా సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని వార్తలు జోరుగా వచ్చాయి.

ఇప్పటికే 50  శాతం షూటింగు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పడు సంక్రాంతి ‘రేసు ’లో వుండదనే టాక్ వినిపిస్తోంది టాలీవుడ్ వర్గాల నుండి. ఎందుకంటే స్టార్ హీరోల సినిమాలతో పాటు చిన్న హీరోల సినిమాలు కూడా సంక్రాంతి రేసులో ఉండటంతో థియేటర్లు దొరకడం కష్టం అవుతుందనే విషయాన్ని కొంతమంది డిస్టిబ్యూటర్లు నిర్మాతకు చెప్పడంతో ఆయన ‘రేసుగుర్రాన్ని ’ ఈ పోటీ నుంచి తప్పించే  అవకాశాలు ఎక్కువగానే వున్నట్లు  ఫిల్మ్‌నగర్‌ టాక్. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి మొదటి వారంలో ప్రేక్షకుల ముందు తీసుకొని వచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles