Richa gangopadhyay goodbye film industry

Actress Richa Gangopadhyay Goodbye Film Industry, Richa Gangopadhyay Goodbye Films, Richa Gangopadhyay final goodbye,

Actress Richa Gangopadhyay Goodbye Film Industry, Richa Gangopadhyay Goodbye Films, Richa Gangopadhyay final goodbye,

మోజు తీరాకే గుడ్ బై అంటుందా ?

Posted: 10/20/2013 07:15 PM IST
Richa gangopadhyay goodbye film industry

సినిమాల్లో అవకాశాలు రావాలంటే అంతా ఆశా మాషీ విషయం కాదు. ఎంతో కష్టపడి అవకాశాల్ని సంపాదించుకున్న తరువాత లక్కుంటే క్లిక్ అవుతారు...లేకుంటే అంతే సంగతులు. కానీ ఒక్కసారి కాస్తంత నేము, ఫేము వచ్చిన తరువాత ఈ రంగుల ప్రపంచాన్ని వదిలి పెట్టడానికి ఇష్టపడరు. కానీ స‌రైన ఫిజిక్‌తో అంద‌రిని ఎట్రాక్ట్ చేసేవిధంగా క‌నిపించి ‘లీడర్ ’ సినిమా తోటాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రిచాగంగోపాధ్యాయ‌ , మిర‌ప‌కాయ్‌, మిర్చి, వంటి సినిమాల్లో తన ఘాటును చూపించి, మన్మధుడు నాగార్జున సినిమాలో ఛాన్సు కొట్టేసిన రీచా కెరియర్ మంచి ఊపందుకోబోతుంది.

ఇలాంటి టైంలో ప్రేక్షకులకు గట్టి షాక్ ఇచ్చే స్టేట్ మెంట్ ఇచ్చింది. ఎంత ప్రయ‌త్నించినా అవ‌కాశాలు వ‌చ్చిన‌ట్టే,వ‌చ్చి చేతులారా జారిపోవడమే కాకుండా, మిగతా భామమంతా స్టార్ డమ్ రాకపోవడంతో రిచాకు టాలీవుడ్ ఇండ‌స్ట్రీ మీద‌, టాలీవుడ్ హీరోల కోపం, అసహం కలిగాయో ఏమో కానీ ఇక సినిమాల్లో నటించనని చెప్పేసింది. కార‌ణం ఏంటమ్మా... అని అడిగితే నేను స్టడీస్ కోసం తిరిగి వెళుతున్నానని, యాక్టింగ్ కన్నా ఎడ్యుకేషన్ ముఖ్యం కదా అని చెప్పుకొస్తుంది. మరి ఈ నాలుగు సంవత్సరాలు రంగుల ప్రపంచం మోజులో మునిగి తేలిన రీచాకు ఉన్నట్లుండి చదువు మీదకు మనస్సు ఎందుకు మళ్లినట్లోనని సినీ జనాలు అంటున్నారు.

స్టడీస్ పూర్తయిన త‌రువాత మ‌ళ్ళీ ఫిల్మ్స్‌లోకి వచ్చి అలరిస్తానని చెబుతున్న ఈమెకు రంగుల ప్రపంచంలో తీరాల్సివన్నీ తీరాయా ? లేక అవకాశాలు రాక మూవీల‌మీద ఇంట్రెస్ట్ తగ్గే తిరిగి ఫారిన్ చెక్కేస్తుందా ? అంటూ దీని వెనక ఉన్న కూపీలు లాగుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles