Samantha siddharth together again

Samantha-Siddharth , samantha lux,Samantha, siddharth, Siddhartha and Samantha endorsing Lux ad,

Samantha joins a elite club which includes Sridevi, Madhuri, Kajol, Aishwarya Rai, Kareena, Asin and Kareena

సమంతా-సిద్దూ సోపేస్తున్నారు

Posted: 09/17/2013 02:58 PM IST
Samantha siddharth together again

టాలీవుడ్ లో ప్రేమ పక్షులుగా చెప్పుకుంటున్న సమంతా, సిద్దార్థ లు కలిసి జనాలకు సోపేయబోతున్నారు. వీరిద్దరు కలిసి గత కొంత కాలంగా ప్రేమలో మునిగితేలుతున్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయం గురించి వారు సోపేస్తున్నారనుకోకండి. అసలు విషయం ఏంటేంటే వీరిద్దరు కలిసి బుల్లితెర పై మంచి సువాసనలు వెదజల్లే సబ్బు ‘లక్స్ ’ యాడ్ లో జంటగా కనిపించబోతున్నారు. ప్రతి హీరోయిన్ ఎప్పుడో ఒకప్పుడు ఒక్కసారైనా ఈ సబ్బుకు సంబంధించిన యాడ్ లో కనిపించాలని అనుకుంటారు. గతంలో శ్రీదేవి, ఐశ్వర్య రాయ్, కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా, అసిన్ లాంటి అందాల సుందరాంగులు ఈ లక్స్ సబ్బు యాడ్ లో నటించి లక్స్ పాపలుగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు వీరి సరసన సమంతా కూడా వచ్చి చేరింది. దీనికి సంబంధించిన షూటింగును కూడా ఇటీవలే బ్యాంకాక్ లో షూట్ చేశారట. ఈ ప్రకటన నవంబర్ నుండి బుల్లితెర పై ప్రసారం కాబోతుందట.

ఈ విషయాన్ని సమంతానే స్వయంగా ట్వీట్ చేసింది. ఎంతో మంది కనిపించిన లక్స్  కాంపెయిన్ లో నేను పాల్గొంటుండడం ఎంతో హ్యాపీగా ఉంది. లక్స్ గర్ల్ కావాలని, ఇలాంటి అందమైన యాడ్స్ లో నేను కూడా కనిపించాలని ఎంతగానో అనుకునేదాన్నో. ఆ కల ఇప్పుడు నెరవేరింది. ఇందులో లక్స్ గర్ల్ కి తోడుగా సిద్ధార్థ్ ఉండడం మరింత ప్రత్యేకంగా ఉంది అని చెప్పుకొచ్చింది. దీనిని బట్టైయినా వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందని మరో సారి చెప్పకనే చెప్పి నిరూపించింది సమంతా. మరి సబ్బు యాడ్ లో నటించి, జనాలు పలు విధాలుగా మాట్లాడుకొని తన ప్రేమను గబ్బు గబ్బు చేసుకోదు కదా అని జనాలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles