Rahul to wed chinmayi next year february 2014

Rahul to wed Chinmayi next year february 2014, Singer Chinmayi, Chinmayi marriage, Chinmayi Rahul Ravindran affair, Andala Rakshasi, Chinmayi to marry Rahul Ravindran

Rahul to wed Chinmayi next year february 2014, Chinmayi to marry Rahul Ravindran

రాహుల్ పెళ్లి చిన్మయితో..

Posted: 09/16/2013 05:41 PM IST
Rahul to wed chinmayi next year february 2014

రాహుల్, చిన్మయి జంట గత కొంత కాలంగా ప్రేమించుకుంటూ ఇప్పుడు పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలెక్కుతున్నారు. వచ్చే ఫిబ్రవరిలో వీరి వివాహం జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. ఇక రాహుల్ అందాల రాక్షసి సినిమాతో తెలుగు వారికి పరిచయమైనా తమిళంలో అప్పటికే మూడు సినిమాలు చేసి ఉన్నాడు. సౌత్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన చిన్మయి త్వరలోనే పెళ్లి కూతురు కాబోతుంది. అందాల రాక్షసి సినిమా హీరో రాహుల్ రవీంద్రన్ ను ప్రేమించి పెళ్లి చేసుకోబోతుంది. ఏ మాయ చేసావే సినిమా కోసం సమంతాకు డబ్బింగ్ చెప్పి పాపులర్ అయిన చిన్మయి రియల్ లైఫ్ లో ప్రేమించి ప్రేమను పెద్దల వద్దకు తీసుకెళ్ళి, వారిని ఒప్పించి పెళ్లి చేసుకోబోతుంది. రాహుల్ ప్రస్తుతం తెలుగులో పెళ్లి పుస్తకం, నేనేం చిన్న పిల్లనా సినిమాలు చేస్తున్నాడు. చిన్మయి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ బాషలలో పాటలతో పాటు హీరోయిన్స్ కు డబ్బింగ్ చెబుతుంది.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh