Auto nagar surya may soon see the light of day

Auto Nagar Surya may soon, naga chaitanya, samantha, autonagar surya, Autonagar Surya

Auto Nagar Surya which kick-started with high expectations thanks to the audio teaser, was put on hold due to financial troubles. The audio teaser as well as the digital poster created ripples and garnered maximum hype around the project. This movie is produced by Atchi Reddy under Max India Productions which is a subsidiary banner of RR Movie makers who have produced several successful movies in the past.

ఆటోనగర్ సూర్య రాబోతుంది

Posted: 08/26/2013 12:35 PM IST
Auto nagar surya may soon see the light of day

వెన్నెల, ప్రస్థానం, లాంటి సినిమాలకు దర్శకత్వం వహించి తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకోవడమే కాకుండా ‘ప్రస్థానం ’ సినిమాకు విమర్శకుల నుండి సైతం ప్రశంసలు అందుకున్న దేవాకట్టా ఎంతో ప్రతిష్టాత్మంగా నాగచైతన్యతో ‘ఆటోనగర్ సూర్య ‘ సినిమాను సగానికి పైగా తెరకెక్కించిన తరువాత ఆర్థిక కారణాల వల్ల ఈ సినిమా అటెకెక్కిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా మరుగుల పడినట్లేనని అంతా అనుకున్నారు. దేవా కట్టా కూడా వేరే సినిమా కోసం కథను సిద్దం చేసుకున్నాడు. కానీ అనూహ్యంగా ఈ సినిమాను కొనసాగించబోతున్నామని స్వయంగా దేవాకట్టానే ట్వీట్ చేశాడు. దీని పై స్పందిస్తూ... కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా నిర్మాణం ఆగిపోయింది. కానీ ఇప్పుడు అన్ని అవాంతరాలు తొలిగిపోయాయి.  ఈ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించి, మిగిలిన నిర్మాణాన్ని పూర్తి చేసి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం అని తెలిపాడు. ఈ సినిమా ఆగిపోవడంతో నాగచైతన్యకు కూడా అవకాశాలు అంతగా రావడం లేదు. ప్రస్తుతం తన ఫ్యామిలీ మల్టీ స్టారర్ చిత్రం అయిన ‘మనం ’ లో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగులో పాల్గొననున్నాడు.ఏది ఏమైనా ‘ఆటోనగర్ సూర్య ’ లో కదలిక రావడం చైతూ అభిమానులకు శుభవార్తే అని చెప్పవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles