Allu arjun publicly praises thaman

llu Arjun Publicly Praises Thaman, Race Gurram Audio Launch Date, Race Gurram Music Release Date, Race Gurram Review

llu Arjun Publicly Praises Thaman, Race Gurram Audio Launch Date, Race Gurram Music Release Date, Race Gurram Review

సంగీత దర్శకుడ్ని ఆకాశానికెత్తేస్తున్నాడు

Posted: 08/09/2013 06:29 PM IST
Allu arjun publicly praises thaman

సినిమా హీరోలు తన సినిమాకు పనిచేస్తున్న సంగీత దర్శకులను పొగడ్తలను ముంచెత్తుతుంటారు. ఆడియోకి ముందు వారిని ఆకాశానికెత్తడం, సినిమా తరువాత ఎత్తేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇఫ్పుడు అల్లు అర్జున్ కూడా అలాంటి పనే చేస్తున్నాడు. ఈ స్టైలిష్ స్టార్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘రేసు గుర్రం ’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న ఎస్.ఎస్. థమన్ తన సినిమాకు అందిస్తున్న పాటల పై తన అభిప్రాయాన్ని చెప్పాడు.  ‘రేసు గుర్రం ’ కోసం థమన్ సాంగ్స్ ఎక్సలెంటుగా ఇచ్చాడని, ఈ సినిమా ఆడియో ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తున్నాను అని సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో ట్వీటాడు. కిక్ సినిమాతో ఫేమస్ అయిన దర్శకుడు సురేందర్ రెడ్డి ‘ఊసరవెల్లి ’ తో బోల్తా పడ్డాడు. ఎలాగైనా ఈ చిత్రాన్ని హిట్ కొట్టాలనే తపనతో ఉన్నాడు. శ్రుతి హాసన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నల్లమలపు శ్రీనివాస్ (బుజ్జీ) నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో బన్నీ బైక్ రేసర్ గా కొత్తగా కనిపించబోతున్నాడని సమాచారం. మరి థమన్ ని అల్లు అర్జున్ నిజంగానే మెచ్చుకున్నాడో లేదో తెలియాలంటే... ఆడియో రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles