Aishwarya rai re entry with abhishek

Aishwarya rai Re-entry with Abhishek, hindi film industry, aradhya bachan, jayabachan, amitabh bachan, with new project masum film, abhishek bachan

Aishwarya rai Re-entry with Abhishek, hindi film industry, aradhya bachan, jayabachan, amitabh bachan, with new project masum film, abhishek bachan

భర్తతో కలిసి ఐష్ రీ ఎంట్రీ

Posted: 07/22/2013 06:09 PM IST
Aishwarya rai re entry with abhishek

సినీ తారలు ఒకసారి వెండితెర రంగుల ప్రపంచంలోని రుచిని చూసిన తరువాత సినిమా రంగాన్ని వదిలిపెట్టడానికి అంతగా ఇష్టపడరు. కొందరు పెళ్లి కారణంగా,  పిల్లల కారణంగా వెండితెరకు కాస్త గ్యాప్ ఇచ్చినా అవకాశం వస్తే రీఎంట్రీ ఇస్తారు. ఇప్పుడు అందాల సుందరి ఐశ్వర్య రాయ్ కూడా అలాంటి కోవలో చేరిపోయింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఐష్ అభిషేక్ ని పెళ్లి చేసుకొని ఓ పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈమె చివరగా కమీట్ అయిన ‘హీరోయిన్ ’ చిత్రం అప్పుడు గర్భం ధరించడంతో ఆ సినిమా నుండి తప్పుకున్న ఐష్ ఆ తరువాత వెండితెర పై కనిపించలేదు. ఇటీవలే కళ్యాణ్ జువెల్లరీ షాపు ప్రారంభత్సవంలో ఏ చిత్రానికి కమీట్ కాలేదని, తనకు రీఎంట్రీ ట్యాగ్  వేయద్దని చిర్రుబుర్రు లాడి, సినిమాకు కమీట్ అయితే చెబుతానని చెప్పిన ఐష్ తెర వెనుక మాత్రం గుట్టు చప్పుడు కాకుండా కథలు విన్న ఐష్ ఓ సినిమా చేయడానికి కమీట్ అయిందని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం వచ్చిన 'మసూమ్‌' సినిమా రీమేక్‌లో ఐశ్వర్య రాయ్‌ నటించేందుకు అంగీకరించినట్లు తెలిసింది. శేఖర్‌ కపూర్‌ రూపొందించిన ఈ చిత్రంలో నసీరుద్దీన్‌ షా, షబానా అజ్మి జంటగా నటించారు. ఇప్పుడు వారి పాత్రల్లో అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్య రాయ్‌ నటిస్తారని వార్తలొస్తున్నాయి. హిమేష్‌ రేషమ్మియా ఈ చిత్రాన్ని తాజాగా నిర్మించబోతున్నారు. పాత చిత్రం నిర్మించిన చందా దత్‌, దేవీ దత్‌ నుంచి హిమేష్‌ రీమేక్‌ హక్కుల్ని కూడా పొందారు. ఈమె రీ ఎంట్రీ షారూఖ్ తో ఉంటుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ తన రీ ఎంట్రీ సినిమాను భర్తతో ప్రారంభించబోతుందన్నమాట. మరి ఇంత వరకు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈ పెళ్ళయిన ఆంటీలు పెద్దగా రాణించిన ధాఖలాలు లేవు. మరి ఐష్ అయినా రీఎంట్రీ కలిసివస్తుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles