Jr ntr desires to work with k vishwanath

NTR Wants Sagarasangamam movie,NTR Movie on Classical Dance,K Viswanath and NTR Movie,NTR Latest movies

K.Vishwanath had revealed that Young Tiger NTR had expressed his desire to act in the remake Kamal Hassan Saagara Sangamam and offered him dates whenever he is ready to make the movie.

యంగ్ టైగర్ తో ‘సాగరసంగమం ’ రీమేక్

Posted: 07/18/2013 05:32 PM IST
Jr ntr desires to work with k vishwanath

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకప్పుడు కమల్ హాసన్-విశ్వనాథ్ నటించిన ‘సాగర సంగమం ’ సినిమాలో నటించబోతున్నాడా ? ఈ సినిమాను రీమేక్ చేయబోతున్నారా ? అంటే అలాంటిది ఏమీ లేదు కానీ మన బుడ్డోడికి మాత్రం ఎప్పటి నుండో అలాంటి సినిమాలో నటించాలని చిరకాల కోరిక. ఈ సినిమా ఎన్టీఆర్ కే కాకుండా ఆయన తల్లికి కూడా చాలా ఇష్టమట. అందుకే ఒక్కసారైన అలాంటి పాత్ర చేయాలని ఎన్టీఆర్, అలాంటి పాత్ర చేస్తే చూడాలని వారి తల్లికి ఉందట. పాప్, వెస్టర్స్ డాన్స్ లతో సినిమాల్లో ఇరగదీసే ఎన్టీఆర్ కి శాస్త్రీయ నృత్యంలోనూ మంచి అనుభవం ఉంది. ఓసారి ఎన్టీఆర్ నేరుగా కె.విశ్వనాథ్ నే అడిగేశాడ‌ట‌. `సార్‌... మీ సినిమాల్లో నాకు సాగ‌ర సంగ‌మం అంటే చాలా ఇష్టం. అలాంటి సినిమా చేసి పెట్టరూ...` అని. దీంతో కాస్త చిరునవ్వు నవ్వి ఊరుకున్న విశ్వనాథ్ అప్పటి నుండి కామ్ గా ఉన్నాడట. కానీ ఇటీవలే ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ... ఎన్టీఆర్ రెడీ అయితే... తాను కూడా ’సాగర సంగమం ’ లాంటి  సినిమా తీయడానికి  సిద్దమే అని చెప్పాడు. మరి విశ్వనాథ్ ఎన్టీఆర్ తో ఆ సినిమానే రీమేక్ చేస్తాడో లేక అలాంటి కథతో మరో సినిమాను తీస్తాడో ? ఒకవేళ అదే నిజమైతే ఈతరం మరో ‘సాగర సంగమం ’ రావడం ఖాయం అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles