Director krish direct nagababu son varuntej

krish and varun tej film, krish and varun tej movie, krish directs varun tej, Mahesh Director for Varun Tej

It has earlier reported that Naga Babu son Varun Tej is set to foray in Tollywood as lead hero. It is confirmed that director Krish.

పూరిని తప్పించి, క్రిష్ కి ఛాన్స్ ఇచ్చారు...

Posted: 07/10/2013 05:09 PM IST
Director krish direct nagababu son varuntej

ప్రముఖ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ కి కాస్తంత నోటి దురుసు ఎక్కువే. అప్పుడప్పుడు సినిమా వాళ్లమీద ఏవేవో కామెంట్లు చేస్తారు. దాని వల్ల ఇండస్ట్రీలో కొన్ని అవకాశలు కోల్పోవాల్సివస్తుంది. తాజాగా ఇటువంటి సంఘటనే ఒకటి జరిగిందని ఫిలింనగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇటీవల పూరీ జగన్నాథ్ మెగా ఫ్యామిలీ నుండి హీరో గా రాబోతున్న నాగబాబు కొడుకు వరుణ్ తేజ ను వెండితెరకు ‘అందగాడు ’ గా పరిచయం చేయబోతున్నాడని , త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు కూడా వెళ్ళబోతుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఏమయిందో ఏమో గానీ అనూహ్యంగా ఈ సినిమా నుండి పూరీ తప్పుకొన్నాడు. ఇప్పుడు ఈయన స్థానంలో దర్శకుడు క్రిష్ వచ్చి చేశాడు.   ఇప్పుడు పూరీ హీరో నితిన్ తో ‘హార్ట్ ఎటాక్ ’ అనే సినిమా చేసే పనిలో పడ్డాడు. పూరీ ఉన్నట్లుండి తప్పుకోవడం వెనుక ఏదో బలమైన కారణం ఉంటుందని అనుకొని ఆరా తీయగా,  ఆ మధ్యన పవన్ కళ్యాణ్ తో సినిమా చేయను అనే వ్యాఖ్యలే మెగా ఫ్యామిలీ ని హర్ట్ చేశాయని అందుకే ఈయన్ను తప్పించి క్రిష్ ని తీసుకున్నారని అనుకుంటున్నారు. ఇప్పటికే శ్రీకాంత్ అడ్డాల, ఇప్పుడు పూరీ మెగా హీరోను లాంచ్ చేసే పనినుండి తప్పుకున్నారు. మరి వచ్చిన క్రిష్ అయినా ఆ పని పూర్తి చేస్తాడా ? లేక మధ్యలోనే తప్పుకుంటాడా అనేది వేచి చూడాలి అంటున్నారు సినీ జనాలు. ఇక రామ్‌చరణ్‌ని తెరపైకి తీసుకొచ్చిన వైజయంతి మూవీస్‌ ద్వారానే వరుణ్‌ తెరంగేట్రం జరగబోతోంది. ఈ సినిమాకి రాధాకృష్ణ జాగర్లమూడి (క్రిష్‌) దర్శకత్వం వహించబోతున్నారు.  సి.అశ్వనీదత్‌ నిర్మాత. ఆగస్టు నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యినట్లు సమాచారం. క్రిష్ ఈ ప్రాజెక్టు కమీట్ అయ్యాడంటే మహేష్ తో ‘శివం ’ సినిమాను ప్రక్కన పెట్టాడనే అనుకోవాలా ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles