Puri jagannath cancelled varun tej movie

Varun Tej-Puri Jagannath project shelved, Puri jagannath next movie with Nitin, Puri jagannath Varun tej Movie shelved

Now the hot topic in Telugu industry is about Varun Tej debut movie. It is all known that Puri is directing his debut movie. But latest news is Puri selected another hero for his script and rejected Varun Tej.

‘అందగాడు ’ కి పూరీ హ్యాండ్ ఇచ్చాడు...

Posted: 07/09/2013 10:51 AM IST
Puri jagannath cancelled varun tej movie

మెగా ఫ్యామిలీ నుండి మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ ఎంట్రీ ఉండబోతుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈయన సినిమాకు టైటిల్ కూడా ఖరారు అయింది. ఇక సినిమా సెట్స్ పైకి వెళ్లడమే తరువాయి అనుకున్నారంతా. ఈ మెగా హీరోను లాంచ్ చేసే బాద్యతను భుజానెత్తుకున్న పూరీ జగన్నాథ్ ఇతన్ని వెండితెర పై ‘అందగాడు ’గా చూపించాలని అనుకున్నాడు. కానీ ఎమైందో ఏమో కానీ ఇప్పుడు పూరీ జగన్నాథ్ ఆ చిత్రాన్ని చేయడం లేదు. ఈ అందాగాన్ని వదిలేసిన పూరీ నితిన్ తో ‘హార్ట్ ఎటాక్ ’ చేయడానికి రెఢీ అయ్యాడు. దీంతో మెగా హీరో ఎంట్రీకి మళ్ళీ బ్రేక్ పడినట్లైయింది. మొదట ఇతన్ని శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేయబతున్నాడని వార్తలు వచ్చాయి. చివరి నిమిషంలో పూరీ చేతుల్లో పెట్టారు. కానీ పూరీ కూడా తప్పుకోవడంతో ఇతన్ని ఎవరు లాంచ్ చేస్తారు ? ప్రస్తుతం పెద్ద పెద్ద సినిమాలతో స్టార్ డైరెక్టర్లు బిజీగా ఉన్నారు. ఈయన కోసం ఎవరు టైం కేటాయించలేని పరిస్థితి. దీంతో వరుణ్ తేజ్ ఎంట్రీ మరింత ఆలస్యం కానున్నదనే వార్తలు ఫిలింనగర్ నుండి వెలువడుతున్నాయి. ఇప్పటికే మెగా హీరోలుగా చెలామణి అవుతున్న పవన్, చరణ్, అర్జున్ ఈయన ఎంట్రీ పై శ్రద్ద పెట్టకపోవడం చూస్తుంటే... నాగబాబు తనయుడు కాబట్టే వీరు పట్టించుకోవడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles