Jr ntr in the remake of ramudu bheemudu

Dr. Ramanaidu planning to remake his movie Ramudu- Bheemudu with Jr. NTR, Ramanaidu register to remake of Ramudu-Bheemudu movie

Dr. Ramanaidu planning to remake his movie Ramudu- Bheemudu with Jr. NTR, Ramanaidu register to remake of Ramudu-Bheemudu movie

రామానాయుడు జూనియర్ తో సినిమా

Posted: 06/06/2013 07:13 PM IST
Jr ntr in the remake of ramudu bheemudu

వంద సంవత్సరాల సినీ చరిత్రలో రామానాయుడి గారికి యాభై ఏళ్ళ ప్రస్థానం. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న రామానాయుడు గారు నిర్మాతగా నిలబడటానికి మూలం ఆ కాలంలో వచ్చిన రాముడు-భీముడు సినిమానే. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాను నిర్మించిన రామానాయుడు దీనిని జూనియర్ ఎన్టీఆర్ తో రీమేక్ చేయాలని ఎప్పటి నుండో చూస్తున్నాడు. తన పుట్టిన రోజు సందర్భంగా మాట్లాడుతూ... ఈ సినిమాను కలర్లో తీయడానికి ఎన్టీఆర్‌తో మాట్లాడాను. చేస్తానన్నాడు. తను ఎప్పుడంటే అప్పుడు చేస్తాను. ఈ సినిమాని ఎన్టీ రామారావుగారి కుటుంబానికి చెందినవాళ్లు చేస్తేనే బాగుంటుంది. ఒకవేళ ఈ రీమేక్ కుదరకపోతే.. పాత ‘రాముడు-భీముడు'ని కలర్‌లోకైనా మార్చుతాను అన్నారు ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు. అప్పట్లో అది నలుపు-తెలుపు సినిమా. ఒకవేళ ఇప్పుడు రీమేక్ చేస్తే చక్కగా కలర్లో తీయొచ్చు. కుదరకపోతే.. కనీసం రంగుల్లో అయినా చూసుకుందామని కలర్‌కి మార్చాలనుకుంటున్నాను అని చెప్పారు. ఒకవేళ అన్నీ కుదిరితే ఈ సినిమా రీమేక్ కి ఎవరు దర్శకత్వం వహిస్తారు అనేది ప్రశ్న.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles