Tollywood news akkineni nagarjuna mother sentiment in discussion

akkineni nagarjuna mother, aavakaya sentiment, akkineni annapurna, akkineni nagarjuna mother sentiment, akkineni nageswari,

akkineni nagarjuna mother sentiment in discussion

గ్రీకువీరుడులో అమ్మ సెంటిమెంట్

Posted: 05/12/2013 11:29 AM IST
Tollywood news akkineni nagarjuna mother sentiment in discussion

మథర్స్ డే సందర్భంగా టాలీవుడ్ ‘గ్రీకువీరుడు ’ లో కదిలిన .. అమ్మ ప్రేమ. అమ్మ చనిపోయినప్పుడు, ఇక అమ్మ లేదే అనే బాధ మరోవైపు.. అనారోగ్యంతో తను పడిన బాధల నుంచి విముక్తి దొరికిందనే ఫీలింగ్ మరోవైపు. ఏదేమైనా అమ్మ లేని లోటు ఎప్పటికీ లోటుగానే ఉంటుంది. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పుడు అమ్మ ‘మీరు వేరు.. మా అబ్బాయి వేరు’ అనేది. పిల్లలు పుట్టేవరకు భర్త మీద, పుట్టిన తర్వాత భర్త మీదకన్నా ఆడవాళ్లకి పిల్లల మీద ఎక్కువగా ప్రేమ ఉంటుందట.

ఇలా జరిగినప్పుడు నాకది కరెక్ట్ అనిపించేది. షూటింగ్ అంటే ఎంతో ఒత్తిడి ఉంటుంది. ఉదయం లొకేషన్‌కి వెళ్లేప్పుడు హుషారుగా, సాయంత్రం ఇంటికి తిరిగొచ్చేటప్పుడు అలసటతో ఇంటికి తిరిగొస్తుంటాం. ఇంటికి రాగానే ‘అలసిపోయావా’ అంటూ అమ్మ తల నిమురుతుండేది. నాన్నగారు అది గమనించి ‘ఎప్పుడైనా నన్నలా చేశావా?’ అని సరదాగా అడిగేవారు. నాన్నగారు సినిమాలతో బిజీగా ఉండేవారు కాబట్టి అమ్మతో ఎక్కువ సమయం గడిపేవాణ్ణి. నాకేం కావాలన్నా అమ్మతో చెప్పి నాన్నకి సిఫార్సు చేయించుకునేవాణ్ణి. కుటుంబ బాధ్యతలన్నీ మోస్తున్నా అమ్మలో ఆ విసుగు ఇసుమంత కూడా కనిపించేది కాదు. ఎప్పుడూ నవ్వుతూ ఉండేది. ఆ నవ్వు చూస్తే టెన్షన్స్ అన్నీ ఇట్టే మాయమయ్యేవి.

సమ్మర్ వస్తే చాలు.. మా ఫ్యామిలీ మొత్తానికి ఆవకాయ పచ్చడి పట్టేది. ఆ రుచి ఎంత కమ్మగా ఉండేదో. అమ్మ పోయిన తర్వాత ఆ బాధ్యతను నాన్నగారు తీసుకున్నారు. అమ్మ ఉన్నప్పుడు రెసిపీ రాయించుకున్నారు. దాన్ని ఫాలో అవుతూ, ఆవకాయ పచ్చడి తయారు చేయించారు. టేస్ట్ చేస్తే అచ్చం అమ్మ పెట్టినట్టే ఉంది. ‘అక్కినేని ఆవకాయ’ అని పేరు పెట్టి, అమ్మితే సేల్స్ బ్రహ్మాండంగా ఉంటుందని నాన్నతో సరదాగా అన్నాను. అమ్మ గురించి ఇంకా చెప్పాలంటే.. ఎప్పుడైనా మూడ్ బాగాలేకపోతే ఇట్టే గ్రహించేసేది. ‘ఏమైంది నాన్నా..’ అంటూ ఆప్యాయంగా మాట్లాడేది. అప్పుడు మూడ్ మళ్లీ మామూలుగా మారిపోయేది. అదీ మా అమ్మ గొప్పదనం. అమ్మ అనే పదంలోని తియ్యదనాన్ని ప్రతిఒక్కరు రుచి చూడాల్సిందే

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles