Sushmita sen not marrying wasim akram

Sushmita Sen, Wasim Akram, Sushmita Wasim marriage, Sushmita Wasim, entertainment news

Actress Sushmita Sen and Pakistani cricketer Wasim Akram today rubbished reports suggesting that they are planning to tie the

ఇతనితో నాకు ఎఫైర్ లేదు - పెళ్లి చేసుకోను

Posted: 04/14/2013 08:07 PM IST
Sushmita sen not marrying wasim akram

పలానా హీరోయిన్ పలానా క్రికెటర్ తో ఎఫైర్ నడిపిస్తుందనే వార్తలు అప్పుడప్పుడు వింటుంటాం. వీరు క్రికెటర్లతో పబ్లిసిటీ కోసం తిరుగుతారో, వారిమీద మోజుతో తిరుగుతారో కానీ , మీడియాకి దొరికిన తరువాత ఆయన నాకు ఎఫైర్ ఏమీ లేదని బుకాయిస్తుంటారు. తాజాగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రం తో బాలీవుడ్ నటి సుస్మితాసేన్ ఎఫైర్ సాగిస్తుందని, త్వరలో వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తల పై స్పందించిన సుస్మితా సేన్ ట్టిట్టర్ లో సమాధానం ఇచ్చింది. వసీంతో నాకు క్లోజ్ ఫ్రెండ్ షిప్ మాత్రమే ఉందని, అది పెండ్లికి దారి తీసేంత క్లోజ్ కాదని చెప్పింది. మరో వైపు వసీం కూడా తన గురించి వస్తున్న పుకార్లు నిజం కాదని ఇంతకు ముందు ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెబుతున్నాను బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌కు నాకు ఎలాంటి సంబంధమూ లేదు, మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని అక్రమ్ స్పష్టం చేశాడు. ఇప్పటికే ముదురు వయస్సుకు వచ్చిన సుస్మితా ఇద్దరి పిల్లలకు తల్లి కూడా. గతంలో కొన్ని సందర్బాల్లో అసలు పెళ్ళెందుకు అని ప్రశ్నించిన ఈమె తను సాదుకుంటున్న ఇద్దరి పిల్లల్ని హ్యాపీగా గడిపేస్తున్నానని పెళ్లి గురించి ఆలోచనే లేదని చెప్పింది. ఇప్పటికైనా ఈ వార్తలకు పుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles