Himmatwala collections for tamanna glamour

himmatwala grand collections for tamanna glamour, tamanna, himmathwala, box office, first day 132 crore, weak 30 crore, glamour

himmatwala grand collections for tamanna glamour, tamanna, himmathwala, box office, first day 132 crore, weak 30 crore, glamour

తమన్నా అందాలకు బాలీవుడ్ జనాలు దోహం

Posted: 04/04/2013 06:53 PM IST
Himmatwala collections for tamanna glamour

tamanna glamour

టాలీవుడ్ ప్రేక్షకులను తన మిల్కీ అందాలతో మత్తెక్కించిన తమన్నా, గంపెడాశలతో బాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడ స్టార్ హీరో ప్రక్కన అలనాటి అందాల సుందరి నటించిన సూపర్ హిట్ చిత్రం ‘హిమ్మత్ వాలా ’కి రీమేక్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా పై బోలెడన్నీ ఆశలు పెట్టుకున్న తమన్నాకి సినిమా విడుదల రోజు నిరాశ ఎదురైంది. ఈ సినిమా పరమ చెండాలంగా ఉందని టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి. తొలి వారం కలెక్షన్లు మొత్తం ముప్పై కోట్లు దాటాయి. ఏదైనా సినిమా ఫెయిల్ అయితే బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు పడిపోతాయి. కానీ ఈ సినిమాకు కలెక్షన్లు బాగానే రావడంతో ఆశ్చర్యపోయిన సినీ పండితులు ఏంటా అని ఆరా తీస్తే అసలు విషయం తెలిసిందట. ఈ వసూళ్ళకు కారణం మాత్రం కేవలం తమన్నా గ్లామర్ మాత్రేమేనని సినీ ప్రియుల నుండి వినిపిస్తున్నమాట. దర్శకుడు తమన్నా మీద పెట్టిన ఫోకస్ కు బాలీవుడ్ సినీప్రియులు తమన్నాను ఎప్పుడెప్పుడు తెరపై చూద్దామా అన్న ఆత్రుతనే ఈ వసూళ్ళకు కారణంగా చెబుతున్నారు . ఏది ఏమైనా అందాలను ఎరగా వేసి సినిమా కలెక్షన్లు సాధిస్తున్న తమన్నాకి బాలీవుడ్ లో స్థానం పదిలమనే మాట వినిపిస్తుంది.  కాసులు రాలాలంటే... అందాలు ఉంటే సరిపోతుందనేది మరోసారి రుజువయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles