Sonakshi demands highest for telugu movie

sonakshi sinha, dabang, director krish, sonakshi in telugu movie

sonakshi sinha demands highest rate of five crores for telugu movie

sonakshi-demands-high.gif

Posted: 02/15/2013 06:34 PM IST
Sonakshi demands highest for telugu movie

    sonakshi

     ఎంతైనా హిందీ తారలు హిందీ తారలే.  ఆకాశమే వారి హద్దు.  తెలుగులో హీరోయిన్ల మాతృభాష హిందీయే అయినా, వారు తెలుగు తారల ముద్ర వేయించుకుంటే వాళ్ళ రేటు తెలుగు రేటే.  తెలుగులో అగ్ర తారలైన కాజల్, అనుష్క, తమన్నాలు కోటి చిల్లర పలుకుతుంటే, హిందీ తారగా ప్రసిద్ధికెక్కి తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టటానికి ఒప్పుకున్న దబాంగ్ భామ సోనాక్షి సిన్హా ఏకంగా 5 కోట్లు డిమాండ్ చేస్తోంది. 

     మేధావి వర్గానికి చెందిన దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో మహేష్ బాబు సరసర నటించటానికి సోనాక్షి పెట్టిన ఈ షరతుని నిర్మాత అశ్వనీ దత్ దాదాపూ అంగీకరించారని వార్త.  మరి ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఐశ్వర్యా రాయ్ రోబో సినిమాకి పుచ్చుకున్నది 4 కోట్లేనట.  అయితే ఇప్పుడు ఐష్ క్రేజ్ పల్చబడి సోనాక్షికి దబాంగ్ తో అమాంతం పెరిగిపోయింది.  దానితో ఆమె 5 కోట్లకి తగ్గనంటోంది. 

     కాస్తంత కండ పుష్టి కూడా ఉండటంతో సోనాక్షి దక్షిణాదివారికి నచ్చవచ్చని సినిమా పండితులు భావిస్తున్నారు.  దానతో, కాస్తంత నుదురు పెద్దగా ఉన్నా పెద్దగా పట్టించుకోరని కూడా అంటున్నారు.  అయితే, మల్టీ స్టారర్ మూవీ లను కొత్తదనాన్ని రంగరించి ఎప్పటికప్పుడు కొత్త తారలతో సరికొత్త కధావస్తువుతో క్రిష్ దర్శకత్వంలో వచ్చే సినిమాలను చూసి, దేవతా వస్త్రాలు కనిపించాయని చెప్పకపోతే చులకనైపోతామన్న భావనతో చాలా బాగున్నాయని చెప్పినట్టుగా, క్రిష్ సినిమా బాగోలేదు అని చెప్పటానికి సంశయించి, బావుంది, కాకపోతే అందరికీ అర్థం కాదు అనో లేకపోతే, ఎంతో మంచి సందేశముంది సుమా అని తలాడించేవారు కూడా చాలామంది ఉంటారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shruthi hassan in rajamouli movie
Romance movie teaser released  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles