Romance movie teaser released

romance telugu movie, telug writer director swami, romance movie teaser

romance telugu movie teaser released.

romance-with-one.gif

Posted: 02/15/2013 05:41 PM IST
Romance movie teaser released

      romance

     తినటానికి ముందు ఎపిటైజర్లు, సినిమాకి ముందు టీజర్లు

     తినాలనే కోరికను ఎపిటైజర్లు పెంచితే, ఆ సినిమాను చూడాలనే కోరికను టీజర్లు పెంచుతాయన్న ఉద్దేశ్యంతో మొదలైన ఈ టీజర్ల కాలంలో నిన్న రామానాయుడు స్టూడియోస్ లో రొమాన్స్ చిత్రానికి చెందిన టీజర్ ని విడుదల చేసారు.

     ఈ సందర్భంలో చిత్ర నిర్మాత స్వామి ఈ చిత్ర కథ లోని సారాంశాన్ని తెలియజేస్తూ, మనిషి శృంగారమనేది ఒకరితో చేస్తేనే ముద్దు, ఇద్దరితో వద్దు అన్న సందేశాన్ని ఇస్తుందని తెలియజేసారు. 

     డార్లింగ్, రెబల్ చిత్రాలకు మాటలు రాసిన స్వామికి ఈ చిత్ర దర్శకత్వానికి అవకాశమివ్వటమే కాకుండా ఒక దర్శకుడికి పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లయితేనే అతనిలోని ప్రతిభ పూర్తిగా పైకి వస్తుందన్న విషయాన్ని కూడా తాము నమ్ముతున్నామని, అదే విధంగా స్వామికి తన పని తాను చేసుకోవటానికి స్వేచ్ఛనిచ్చామని చిత్ర సమర్పకుడు మారుతి అన్నారు.  ఇది మంచి ప్రేమ కథా చిత్రమని, ఈ సినిమాకి తప్పక ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందని కూడా ఆశాభావాన్ని వ్యక్తపరచారు.   ఇప్పటికే 70 శాతం పూర్తైన ఈ చిత్రం వేసవిలో విడుదలవుతుందని నిర్మాతలు తెలియజేసారు. 

     నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా రొమాన్స్ చిత్రం పట్ల తమ సంతృప్తిని వెల్లడించారు. ఇందులో హీరోగా ప్రిన్స్ నటిస్తుండగా, డింపుల్, మానసలు అతనితో రొమాన్స్ లో మహిళా సహాయాన్నందిస్తున్నారు.  చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న స్వామి తనదైన ప్రొఫెషన్ లో దీనికి మాటలు కూడా సమకూరుస్తున్నారు.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sonakshi demands highest for telugu movie
Movie starts with anuskha as rudramadevi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles