Iddarammayilato movie updates

iddarammayilato movie, iddarammayilato movie teaser, iddarammayilato movie shooting updates, iddarammayilato movie working stills, allu arjun family, bunney family, iddarammayilato, amalapaul, ketherine, puri jagannath, bandla ganesh, movie news, film news

iddarammayilato movie updates

1.gif

Posted: 01/31/2013 11:55 AM IST
Iddarammayilato movie updates

13

       ఇటీవలే బ్యాంకాక్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న అల్లు అర్జున్, పూరీ జగన్నాథ్ ల కాంబి  'ఇద్దరమ్మాయిలతో'  స్పెయిన్ లో మిగతా చిత్రీకరణ జరుపుకోవడానికి రెడీ అవుతోంది. ఫిబ్రవరి  నుంచి  స్పెయిన్ లో  రెండవ షెడ్యూల్ ను మొదలు పెట్టేందుకు నిర్మాత ప్లాన్ చేశారు. ఈ మూవీ బడ్జెట్ విషయంలో ప్యొడ్యూసర్ బండ్లగణేష్ ఏమాంత్రం సంకోచించకుండా ముందుకు పోతున్నాడు.  మూడు వారాల పాటు  బ్యాంకాక్ లోని అడవి ప్రాంతంలో థాయ్ ఫైట్ మాస్టర్ కేచే కంపక్డీ ఆధ్వర్యంలో చిత్రానికి సంబంధించి  పలు ప్రధాన సన్నివేశాలను, యాక్షన్ సీన్లను చిత్రీకరించిన సంగతి మనకు తెలుసు. కంపర్డీ గతంలో 'బ్లడ్ స్పోర్ట్ 2', 'అంగ్ బక్ 2' సినిమాలకు పనిచేశాడు.  ఈ సినిమాకి ఫైట్స్ కంపోజ్ చేస్తున్నందుకు ఈ హాలీవుడ్ మాస్టర్ కి నిర్మాత బండ్ల గణేష్  ఏకంగా, రెండు కోట్ల రూపాయలను పారితోషికంగా ఇవ్వటం విశేషం. ఇందులో అర్జున్ పక్కన మరో హీరోయిన్ కేథరిన్ నటిస్తుండగా బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. సంగీతాన్ని దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నాడు.
       ఇక, ఈ సినిమా విశేషాల గురించి అర్జున్ వివరిస్తూ 'కేచే పోరాటాలను అద్భుతంగా డిజైన్ చేశాడు. వాటి గురించి నేను చెప్పేకంటే రేపు సినిమాలో మీరు చూస్తేనే థ్రిల్ గా వుంటుందని బన్నీ అంటున్నాడు. ఈ చిత్రానికి చెందిన ఒక షూటింగ్ షెడ్యూల్ ముగియడంతో  ప్రస్తుతం చిత్ర యూనిట్ హైదరాబాదులో విశ్రాంతి తీసుకుంటోంది.  హీరో బన్నీ అయితే.. ఎంచక్కా.. అన్నదమ్ములు, భార్య, వదినతో ఓ రోజంతా హాయిగా గడిపాడు.  ఈ పార్టీలో అరవింద్ పెద్ద కొడుకు వెంకటేష్, ఆయన భార్య నీలిమ, అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహారెడ్డి, చిన్న కొడుకు శిరీష్ పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను అల్లు అర్జున్ తన అభిమానులకోసం విడుదలచేశాడు కూడా.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ileana in hindi stalin
Pawan kalyan mahesh babu on forbes  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles