Tollywood music directors achievements in 2012

devi sri prasad, taman, manisharma, keeravani, chakri, ilayaraja, mickey j meyor, koti, anoop, shekar chandra, kartik raja, tollywood music directors, achievements in 2012

tollywood music directors achievements in 2012

21.gif

Posted: 12/31/2012 05:19 PM IST
Tollywood music directors achievements in 2012

 e

       గతంతో పోల్చుకుంటే అవకాశం సంగీత దర్శకులు చిత్రసీమలోకి ఎంట్రీ ఇవ్వటం ఇప్పడు సులభమైంది.  దీంతో ఎందరో నూతన సంగీత దర్శకులు పరిశ్రమలోనికి ప్రవేశించి, తమ సత్తాను చాటుకునేందుకు పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో 2012వ సంవత్సరంలో సినీ సంగీతం ఎలాంటి పుంతలు తొక్కిందో చూద్దాం...
దేవీ శ్రీ ప్రసాద్ :
       ఈ ఏడాది దాదాపు 125 స్ట్రయిట్‌ చిత్రాలు తెలుగులో విడుదలైతే, పలు మ్యూజికల్‌ హిట్స్‌ తో దేవిశ్రీప్రసాద్‌ తన ప్రత్యేకతను చాటుకోవడం ఓ విశేషం. వాటిలో అల్లు అర్జున్‌ 'జులాయి', పవన్‌కల్యాణ్‌ 'గబ్బర్‌సింగ్‌', నాగార్జున 'ఢమరుకం' చిత్రాలున్నాయి. 'గబ్బర్‌సింగ్‌'లోని ''కెవ్వుకేక'', ''గుండెజారి గల్లంతయ్యిందే'' వంటి పాటలతో పాటు ఇతర పాటలు శ్రోతలను ఎంతగా అలరింపజేశాయో తెలియంది కాదు. అలాగే 'ఢమరుకం'లోని ఇతర పాటలతో పాటు ప్రత్యేకించి ''సక్కుబాయి'' అనే ఐటమ్‌ సాంగ్‌ ఎంతగా పాపులర్‌ అయ్యిందో తేటతెల్లమే. అయితే 'సారొచ్చారు' చిత్రం అనుకున్నంతగా ప్రేక్షకాదరణను చూరగొనలేకపోయింది.
తమన్ :      
          ఈ ఏడాది తమన్ మాంచి ఊపుమీదున్నాడు. అతను చేసిన చిత్రాలలో 'బిజినెస్‌మేన్‌' విజయాన్ని సాధించి, అతనికి మంచిపేరు తెచ్చిపెట్టింది. 'నిప్పు, బాడీగార్డ్‌' వంటి చిత్రాలు అతనికి అనుకున్నంతగా పేరును తెచ్చిపెట్టలేకపోగా, 'లవ్‌ ఫెయిల్యూర్‌' ఫర్వాలేదని అనిపించుకుంది. ఇక రామ్‌చరణ్‌ తాజా చిత్రం 'నాయక్‌' నూతన ఏడాదిలో సంక్రాంతి సందర్భంగా విడుదలవుతుండగా, ఆ చిత్రం ఆడియో ఈ మధ్యనే విడుదలైన విషయం తెలిసిందే. ఆడియో సక్సెస్‌ అయింది.
మణిశర్మ :
            ఇంతకుముందు చక్రం తిప్పిన సంగీత దర్శకుడు మణిశర్మ తన స్థానాన్ని పదిలపరచుకునేందుకు ఈ ఏడాది ప్రయత్నాలు చేశాడు. రామ్‌చరణ్‌  'రచ్చ' 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు', 'కృష్ణం వందే జగద్గురుమ్‌' చిత్రాలతో మంచి మార్కులు సంపాదించాడు. .
 కీరవాణి :
       ఈ ఏడాది కీరవాణి సంగీతాన్ని అందించిన 'దమ్ము', 'ఈగ', 'శిరిడిసాయి' చిత్రాలు ఘన విజయం సాధించాయి. 'ఈగ' రీరికార్డింగ్‌ ప్రాధాన్యాన్ని సంతరించుకోగా, 'శిరిడిసాయి' భక్తి సంగీతం ప్రేక్షకులను ఓలలాడించింది.
చక్రి :
      'సింహా' చిత్రంతో కేక పుట్టించిన చక్రి ఈ ఏడాది అదే హీరోకి సంగీతాన్ని అందించిన 'శ్రీమన్నారాయణ' చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోగా, సంగీతపరంగా కూడా ఆయనకు అంతగా పేరు రాలేదు. అలాగే శ్రీకాంత్‌ 'దేవరాయ' చిత్రం కూడా చక్రికి ఆశించన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అయితే 'దేనికైనారెడీ' సంగీత పరంగా, సినిమా పరంగా కూడా విజయం సాధించింది.
ఇలయరాజా :
      సంగీతం ఇళయరాజా సొంతం. గతంలో అన్ని సినిమాలను నేడు ఆయన చేయకపోయినా చేసిన చిత్రాల్లోని సంగీతం శ్రోతల మనసులను పులకరింపజేస్తుందనడంలో ఎలాంటి సంశయం అక్కరలేదు. ఈ ఏడాది ఆయన సంగీతాన్ని అందించిన 'ధోని' చిత్రం కమర్షియల్‌గా అంతగా ఆడకపోయినా ఓ మంచి చిత్రం అనిపించుకుంది. ఇక ఈ మధ్యనే విడుదలైన 'ఎటోవెళ్లిపోయింది మనసు' అటు సంగీతపరంగాను, ఇటు సినిమా పరంగాను ఎంతగా ప్రేక్షకులను అలరింపజేస్తుందో తెలిసిందే. ఇక ఆయన సంగీత దర్శకత్వంలో రూపొందిన 'గుండెల్లో గోదారి' చిత్రం ఆడియో ఇటీవలనే విడుదలై, శ్రోతల ఆదరణ పొందుతోంది.
మిక్కి జె మేయర్..
           'హ్యాపీడేస్‌'తో అందరి దృష్టిని ఆకర్షించిన మిక్కీ జె.మేయర్‌ ఈ ఏడాది సంగీతాన్ని అందించిన 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌' చిత్రం కూడా అతనికి మంచిపేరు తెచ్చిపెట్టింది. మరో విశేషమేమిటంటే..వెంకటేష్‌, మహేష్‌బాబు వంటి మల్టీస్టారర్‌ చిత్రం 'సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు' చిత్రానికి మిక్కీకి అవకాశం లభించడంతో పాటు ఇటీవల విడుదలైన ఆ ఆడియో విజయవంతం కావడంతో మిక్కీ మరింత పేరును సంపాదించుకున్నారు. ఈ సినిమా హిట్‌ రేంజ్‌ను బట్టి ఆయన పేరు ఇంకెంతగా ఫోకస్‌ అవుతుందో వేచిచూడాల్సిందే.
కోటి :
         ఇక ఈ నెలాఖరులో విడుదలైన 'యముడికి మొగుడు' చిత్రం ఫలితం పూర్తిస్థాయిలో తెలియాల్సివుండగా, సంగీత పరంగా మాత్రం కోటి తనదైన ముద్రను వేసుకున్నారు. ఎ.ఆర్‌.రెహ్మాన్‌ మేనల్లుడైన జి.వి.ప్రకాష్‌ తెలుగులో స్ట్రయిట్‌ చిత్రాలకు సంగీతాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆయన సంగీతాన్ని అందించిన రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ 'ఎందుకంటే ప్రేమంట' అంతగా గుర్తింపును ఇవ్వలేకపోయింది.
       కాగా కొందరు వర్ధమాన సంగీత దర్శకుల విషయానికి వస్తే, అనూప్‌కు 'పూలరంగడు, ఇష్క్‌, లవ్లీ' చిత్రాలు, శేఖర్‌చంద్రకు 'అవును', 'మేం వయసుకు వచ్చాం' చిత్రాలు ఎంతగానో పేరు తెచ్చిపెట్టాయి.
      లోగడ 'మడతకాజా' చిత్రానికి సంగీతాన్ని అందించిన శ్రీవసంత్‌ ఈ ఏడాది 'సుడిగాడు' చిత్రం ద్వారా ఎంతో ఫోకస్‌ అయ్యారు. ఆడియోతో పాటు ఆ సినిమా కూడా కలెక్షన్ల సుడిగాడుగా పేరు సంపాందించుకున్న విషయం తేటతెల్లమే.
       ఇక 'ఈరోజుల్లో' అనే చిత్రం ద్వారా జె.బి. అనే సంగీత దర్శకుడు పరిచయమయ్యారు. ఆ చిత్రంతో పాటు ఆయన ఇదే ఏడాది సంగీతాన్ని అందించిన మరో చిత్రం 'బస్‌స్టాప్‌' కూడా మంచిపేరు తెచ్చిపెట్టింది.
       ఇళయరాజా మరో కుమారుడు కార్తీక్‌రాజా 'తూనీగ తూనీగ' చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమై, గుర్తింపును పొందలేకపోయారు.
       తేజ దర్శకత్వంలో వచ్చిన 'నీకు నాకు' చిత్రం ద్వారా యశ్వంత్‌నాగ్‌ సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. సంగీత పరంగా ఆయనకు పేరొచ్చినప్పటికీ, చిత్రం విజయం సాధించకపోవడంతో అనుకున్నంత గుర్తింపును పొందలేకపోయారు.
ఇవీ.... 2012లో సినీ సంగీత దర్శకుల ప్రతిభా పాటవాలు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Another hero daughter tollywood entry
Moive on sushmita sen life history  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles