Life is beautiful up date news

life is beautiful up date news , new triler launch, big release in us, anjala zaveri sriya

life is beautiful up date news

24.gif

Posted: 09/04/2012 05:02 PM IST
Life is beautiful up date news

life_is_be_e      కొంచెం సేపటి క్రితం శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ కొత్త ట్రైలర్ రిలీజైంది. ఇందులో విశేషం ఏమిటంటే..  దాదాపు 15 ఏళ్ల క్రితం తెలుగు తెరకు ‘ప్రేమించుకుందాం రా’ సినిమాలో వెంకీతో పరిచయమైన అందాల భామ అంజలా జవేరీ మళ్లీ ఇప్పడు ఈ ట్రైలర్ లో ప్రత్యక్షమయ్యి ఆటపాటలతో కనువిందు చేసింది. పూర్తిగా శేఖర్ కమ్ముల మార్కు లో ఈ ట్రైలర్ చూపరులను ఇట్టే ఆకట్టుకునే విధంగా తయారైంది. ఈ ట్రైలర్ మీకోసం దిగువ అందిస్తున్నాం..
         ఇక ఈ మూవీ గురించి మరో స్పెషల్ న్యూస్ ఏమంటే.. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఇప్పటివరకూ యు.ఎస్ లో ఏ తెలుగు చిత్రం విడుదల కానంత భారీగా విడుదల కానుంది . ఈ మూవీ యు.ఎస్ లో సుమారు 55 సెంటర్లకు పైనే విడుదల కానుంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ పెద్ద హీరో సినిమా కూడా ఇన్ని సెంటర్లలో విడుదల కాకపోవటం ఇక్కడ విశేషం.  ఈ రోజు ప్రసాద్ లాబ్స్ లో జరిగిన ప్రెస్ మీట్లో శేఖర్ కమ్ముల ఈ విషయాన్ని తెలియజేసారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 14న విడుదల కానుంది. యు.ఎస్ లో ఇన్ని సెంటర్లలో విడుదలవడం చూస్తే యు.ఎస్ మార్కెట్లో శేఖర్ కమ్ముల కి ఎంత డిమాండ్ ఉందో తెలుస్తోంది. ఫైకస్ వారు ఈ చిత్రాన్ని యు.ఎస్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సీడెడ్లో సాయి కొర్రపాటి, నైజాంలో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.
      ఇదిలా ఉండగా, ఆనంద్, హ్యాపీడేస్ తరహాలో కొత్త కోణం ఆవిష్కరించబోతోన్న ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ మూవీ కొన్ని వారాల క్రితమే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను స్వయంగా శేఖర్ కమ్ముల దగ్గరుండి పరిశీలించారు. వైవిధ్యమైన పబ్లిసిటీ చెయ్యాలని  కూడా శేఖర్ కమ్ముల భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమోషన్స్ ఈ వారంలో మొదలు కానున్నాయి.
        అభిజీత్, సుధాకర్, కౌశిక్, శగున్, జర, రశ్మి, కావ్య, నవీన్, విజయ్, సంజీవ్ మరియు శ్రీ రామ్ ఈ చిత్రంతో తెరకు పరిచయం కానున్నారు. రెండు దశాబ్దాల తరువాత ఈ చిత్రంలో అమల అక్కినేని తిరిగి నటించడం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. శ్రియ సరన్, అంజలా జావేరీలు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్నారు. మిక్కీ జె మేయర్  సంగీతం అందించగా విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ravi teja sruthi hassan balupu
Balakrishna isha chawla new movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles