Balakrishna isha chawla new movie

balakrishna isha chawla new movie

balakrishna isha chawla new movie

26.gif

Posted: 09/04/2012 03:28 PM IST
Balakrishna isha chawla new movie

      bala_isha_11.1 మొత్తనికి ముద్దుగుమ్మ ఇషాచావ్లా బాలయ్య బాబు దగ్గర మంచి మార్కులే కొట్టేసింది. bala_isha_inner_1ఎంతగా బాలయ్య మనసుదోచిందంటే.. మళ్లీ ఆ అమ్మాయి సరసనే నటిస్తానని చెప్పేంత రీతిలో.. 'ప్రేమకావాలి' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన కథానాయిక ఇషాచావ్లా కెరీర్ గ్రాఫ్ ఈ విధంగా పైపైకి లేస్తోంది. ఇటీవలే బాలకృష్ణ సరసన 'శ్రీమన్నారాయణ' చిత్రంలో కథానాయికగా నటించిన ఈ ముద్దుగుమ్మ, మరోసారి ఆయనతో నటించే చాన్స్ కొట్టేసింది. బాలకృష్ణ కథానాయకుడుగా రూపొందే 'ఆదిత్య 999' భారీ చిత్రంలో ఆమె ఓ కథానాయికగా ఎంపికైనట్టు సమాచారం. 'ఆదిత్యా 369' చిత్రానికి ఇది సీక్వెల్ గా రూపొందుతుంది. 'శ్రీమన్నారాయణ' సినిమాలో బాలకృష్ణ పక్కన ఇషా జోడీ బాగుందన్న కామెంట్స్ రావడం, బాలయ్య కూడా ఆమె వైపే ఎక్కువ మగ్గు చూపటం కారణంగా  ఆమెకు మరోమారు అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సంగతి ఇలా ఉంటే.. ‘శ్రీమన్నారాయణ’ సినిమాలో ఒక పాటకు కాస్త హద్దులు దాటి ఎక్స్‌ పోజింగ్ చేశానని.. అందుకు అభిమానులు తనను మన్నించాలని అంటోంది ఇషా. తనకు హోమ్లీ పాత్రలంటేనే ఇష్టమని.. ఇకపై ఎక్స్‌ పోజింగ్‌ విషయంలో హద్దుదాటనని చెబుతోంది. ‘కథ డిమాండ్ చేసినా బికినీ వేసుకోవడానికి ఒప్పుకోను. ఇంతకుముందు చేసిన చిత్రాలతో గుర్తింపు వచ్చినప్పటికీ, ‘శ్రీమన్నారాయణ’ నన్ను ప్రేక్షకులకు బాగా దగ్గర చేసింది. ఒక పెద్ద సినిమా చేయడంవల్లే ఈ గుర్తింపు. ‘ఆ అమ్మాయి మంచి ఆర్టిస్ట్’ అంటూ బాలకృష్ణ గారు ఇచ్చిన కాంప్లిమెంట్‌ని ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన పెద్ద హీరో అయినప్పటికీ అందరితో స్నేహంగా ఉంటారు’ అని చావ్లా చెప్పింది. మొత్తానికి ప్రేమకావాలి, పూలరంగడు, శ్రీమన్నారాయణతో హ్యాట్రిక్ కొట్టింది ఇషా. ప్రస్తుతం ఆమె సునీల్ సరసన ‘తను వెడ్స్ మను’ రీమేక్ లో నటిస్తోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Life is beautiful up date news
Raghavendra rao son prakash and bala krishna  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles