Srimannarayana movie review

balakrishna parvathi melton, staring srimannarayana movie release today review

srimannarayana movie review

1.gif

Posted: 08/30/2012 12:01 PM IST
Srimannarayana movie review

srimanna_rayana_f

సినిమా పేరు : శ్రీమన్నారాయణ
విడుదల తేదీ : 30.08.2012
నిర్మాత:        రమేష్ పుప్పాల
దర్శకుడు:      రవి కుమార్ చావలి
సంగీతం:        చక్రి
తారాగణం:      బాలకృష్ణ, ఇషా చావ్లా, పార్వతి మెల్టన్, జయప్రకాశ్ రెడ్డి, సురేష్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కృష్ణ భగవాన్, రావు రమేష్, కోట శ్రీనివాస్ రావు, విజయ్ కుమార్..
ఆంధ్ర విశేష్.కాం రేటింగ్ : 2.25

నందమూరి అందగాడు..నటసింహం.. బాలకృష్ణ హీరోగా ఎల్లో ఫ్లవర్స్ సంస్థ బ్యానర్ పై తెరకెక్కిన సినిమా ‘శ్రీమన్నారాయణ’. పార్వతీ మెల్టన్, ఇషా చావ్లా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఇవాళ (గురువారం) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీలో తొలిసారిగా బాలయ్య జర్నలిస్టుగా కనిపించారు. రవి సి. కుమార్ దర్శకత్వం వహించిన శ్రీమన్నారాయణకు చక్రీ సంగీతం అందించారు. కొంతకాలంగా బాలయ్య అభిమానులంతా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్న ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :
శ్రీమన్నారాయణ (బాలకృష్ణ) ఒక పవర్ ఫుల్ రిపోర్టర్.  తన గట్స్ తో  సమాజంలోని అన్ని అసమానతలు , అక్రమాలమీద గళమెత్తే ధైర్యశాలి. తన తండ్రి (విజయకుమార్) ఆశయాల మేరకు సమాజంలోని కుళ్లుని ఎలా కడిగేశాడనేదే చిత్ర ప్రథాన ఇతి వ్రుత్తాంతం. ఈ క్రమంలో తన తోటి జర్నలిస్ట్ పార్వతి మెల్టన్ ను ఓ ఆపదనుంచి కాపాడి ఆమెతో ప్రేమలో పడతాడు. మరదలుగా ఇషా చావ్లా కూడా హీరో కావాలనుకుంటుంది. ఇలా సాగుతూ.. శ్రీమన్నారాయణ చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కిన మూవీ ఇది. హీరో అడ్డంకులను అధిరోహించి తన  లక్ష్య సాథన ను ఎలా చేరుకున్నాడు అనేదే క్లుప్తంగా చిత్ర కథ.

కథనం నడిచిన వరుస క్రమం :

శ్రీమన్నారాయణ టైటిల్ తో హైదరాబాద్లో కథ మొదలు పెట్టారు. బైలు రెడ్డి పాత్రలో జయప్రకాశ్ రెడ్డి, హర్షద్ కొటారి పాత్రలో సురేష్ విలన్లుగా ఎంట్రీ ఇచ్చారు. చానల్ 6 టీవీ రిపోర్టర్ గా పర్వతి మెల్టన్ కనిపించింది. పవర్ ఫుల్ టీవీ రిపోర్టర్ శ్రీమన్నారాయణ పాత్రలో బాలయ్య ఎంట్రీ. సాటిలైట్ టెక్నాలజీ వాడుకొని తన తోటి ఉద్యోగిని కాపాడే చేజ్ సన్నివేశంతో బాలయ్య ఇంట్రడక్షన్ సీన్. సినిమాలో మొదటి ఫైట్. బాలయ్య పంచ్ డైలాగ్స్.., 'క్యా బే' అనే మొదటి పాటలో చాలా సన్నగా పార్వతి మెల్టన్. టీవీ ఛానల్ హెడ్ కోటిలింగం పాత్రలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం కామెడీ,ఎం.ఎస్ నారాయణ, కృష్ణ భగవాన్ పూజారి పాత్రల్లో తెరంగేట్రం. బాలకృష్ణ మరదలి భాను పాత్రలో ఇషా చావ్లా. వీరి మధ్య యూరప్ లో చిత్రీకరించిన 'చలాకి చూపుల్తో' పాట. పోలిస్ ఐ.జి పాత్రలో రావు రమేష్, బ్యాంక్ మేనేజర్ రాజన్ పాత్రలో కోట శ్రీనివాస్ రావు తెరపైకి.. బాలకృష్ణ నాన్న పాత్రలో విజయ్ కుమార్ ఎంట్రీ. బాలకృష్ణ - ఇషా చావ్లా మధ్య రొమాన్స్. బాలకృష్ణ, పార్వతి మెల్టన్ పై 'కొట్టేద్దునా చుట్టేద్దునా' పాట. దువ్వాసి మోహన్  డైలాగ్స్ తో నవ్వులు. సినిమాలో సీరియస్ నెస్. సి.బి.ఐ ఆఫీసర్ గా వినోద్ కుమార్ ఎంట్రీ. తాజాగా మన దేశంలో జరిగిన స్కాంలపై బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్. బాలకృష్ణ కొత్త గెటప్ సూపర్బ్. ఫస్టాఫ్ కంప్లీట్.
సెకండ్ హాఫ్ మొదలు. జైల్లో భారీ ఫైట్. బాలయ్య - ఇషా చావ్లా మధ్య 'తకతై' పాట. రివెంజ్ డ్రామా రసవత్తరంగా మారింది. లక్ష్మీ నరసింహ స్వామి గెటప్ లో బాలయ్య. కథ నల్లమల అడవులకి మారింది. తన మార్క్ కామెడీతో జయప్రకాశ్ రెడ్డి హాస్యం. బాలయ్య ఇద్దరు కథానాయికలతో 'ఆరడుగుల అబ్బాయి' మాస్ సాంగ్. పార్వతి మెల్టన్, ఇషా చావ్లా డబుల్ మీనింగ్ డైలాగ్స్. కథలో మలుపుతో మలేషియాకి. భారీ ఫైట్ తో క్లైమాక్స్. కథ కంచికి...

సమీక్ష:
బాలయ్య డైలాగ్ డెలివరీలోనూ, నటనలోనూ తన దైన శైలిలో మెప్పించారు.  దర్శకుడు రవి చావలి. స్ర్కీన్ ప్లే,  దర్శకత్వ ప్రతిభ సినిమాలో కనిపించింది. ఆయన రాసిన డైలాగ్స్ బాగా పేలాయి. చక్రి సంగీతం ఓకే. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. కొరియోగ్రఫీ, బాలయ్య గెటప్ ప్రధాన ఆకర్షణ. ‘బాదడానికి బయోడేటా ఎందుకురా..’ ‘శ్రీ క్రుష్ణుడు భగవద్ఘీత అర్జునుడు ఒక్కడికేగా చెప్పాడు.. మరి ప్రపంచమంతా ఎలా లీకైంది...’ తదితర డైలాగ్స్ ప్రేక్షకుల చప్పట్లకు కారణమయ్యాయి. అందాల భామలు ఇషా చావ్లా, పార్వతీ మెల్టన్ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. బాలయ్య తండ్రి పాత్రలో విజయ్ కుమార్ సూపర్ గా నటించారు. కోటా నటన బావుంది. జయప్రకాష్ నారాయణ పాత్ర అంతగా ఆకట్టుకోలేకపోయింది. ధర్మవరపు నవ్వులు పూయించాడు.
బాటమ్ లైన్ :
మొత్తంగా మరీ అంత అత్యద్భుతాలు లేని బాలయ్య బాబు ‘శ్రీమన్నారాయణ’ సాదాగా సాగింది.

...avnk

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mister parvateesam movie starts
Ntr harish shankar film jana gana mana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles