Naga chaitanya and tamanna romance again

Milk beauty Tamanna has replaced bubbly actress Hansika Motwani in the Telugu remake of 'Vettai', starring Sunil and Naga Chaitanya in lead roles. Naga Chaitanya and Tamanna acted together in sensational hit '100% Love' and their onscreen chemistry won applause from all sections of the people

Milk beauty Tamanna has replaced bubbly actress Hansika Motwani in the Telugu remake of 'Vettai', starring Sunil and Naga Chaitanya in lead roles. Naga Chaitanya and Tamanna acted together in sensational hit '100% Love' and their onscreen chemistry won applause from all sections of the people

Naga chaitanya and Tamanna romance again.png

Posted: 08/25/2012 08:10 PM IST
Naga chaitanya and tamanna romance again

Thamanna_Nagachithanya

కొందరు హీరోలు కొంత మంది హీరోయిన్లతో నటించాలని అనుకుంటారు. ఒక్కసారి నటిస్తే, అందులో కెమిస్ట్రీ బాగా కుదిరితే మళ్ళీ మళ్ళీ వాళ్లతోనే నటించాలని కోరుకుంటారు. ఒకవేళ తను నటించే సినిమాలో వేరే హీరోయిన్ ని తీసుకుంటే దర్శక నిర్మాతలతో చెప్పి తనకు కావాల్సిన హీరోయిన్ ని పెట్టించుకుంటారు. ఇప్పుడు నాగచైతన్య కూడా అదే పని చేశాడు. తాజాగా తమిళ మూవీ ‘వెట్టై ’ సినిమాలో తెలుగుతో రీమేక్ చేస్తున్నారు. ఆ సినిమా తమిళ వెర్షన్ లో హన్సిక నటించింది. తెలుగులో కూడా హన్సికనే తీసుకోవాలని దర్శక నిర్మాతలు అనుకున్నారు. కానీ నాగచైతన్య మాత్రం హన్సికని వద్దు... తమన్నా కావాలని అనడంతో వారు తమన్నాని ఒప్పించారట. వీరిద్దరు 100%లవ్ చిత్రంలో నటించారు. అందులో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది.

దాంతో నాగచైతన్య ఎలాగైనా తమన్నాతో నటించాలని డిసైడ్ అయ్యాడు.  ప్రస్తుతం పూరీ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ తో కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం చేస్తుంది. మల్టి డైమన్షన్ సమర్పణలో బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యు.టీవి వారి వద్దనుంచి బెల్లంకొండ రైట్స్ తీసుకున్నారు. తెలుగు వెర్షన్ కి దర్శకుడుగా డాలీ(కిషోర్ కుమార్ పార్థసాని)ని ఎన్నుకున్నారు. కొంచెం ఇష్టం..కొంచెం కష్టం చిత్రంతో దర్శకుడుగా మారిన డాలికి ఇది రెండో చిత్రం. అయితే సినిమా జనాలు మాత్రం నాగచైతన్య మొత్తానికి తమన్నాను పెట్టుకొని తన కోరిక తీర్చుకున్నాడని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hollywood hero van dem
Ileana realised i want to get some weight back  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles