Kamala devi funeral

kamala devi funeral

kamala devi funeral

15.gif

Posted: 08/17/2012 07:41 PM IST
Kamala devi funeral

      పాతతరం నటి, గాయని డబ్బింగ్‌ ఆర్టిస్టు టి.జి.కమలాదేవి అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. ఎంతోకాలం చిత్ర సీమకు kamala_eసేవలందించిన ఆమె నిన్న చెన్నరులో అస్వస్థతతో మరణించారు. 83 సంవత్సరాల కమలాదేవి తెలుగు, తమిళభాషల్లో సుమారు ఏభై చిత్రాలలో నటించారు. దక్షయజ్ఞం, బాలనాగమ్మ, మల్లీశ్వరి, పాతాళభైరవి, పల్లెటూరు, తోడుదొంగలు, వెలుగునీడలు, భక్తరామదాసు, అభిమానవతి...వంటి చిత్రాల ద్వారా ఆమె ప్రేక్షకులకు చేరువయ్యారు. చిత్తూరు జిల్లా కార్వేటినగరం గ్రామానికి చెందిన ఆమె అసలు పేరు గోవిందమ్మ. సినిమాలలోకి రాక మునుపు ఆమె రంగస్థలంపై మహిళా పాత్రలతో బాటు పురుష పాత్రలు కూడా పోషించి పేరు తెచ్చుకున్నారు. అలెగ్జాండర్‌ పాత్ర పోషణకు ఆమె పెట్టింది పేరు. ఆమె అంతిమ యాత్రలో అనేక మంది అభిమానులు పాల్గొని ఆమెకు కడసారి వీడ్కోలు పలికారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Raghavendra rao next movie intinta annamayya
Sriya hot stills  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles