Vetern actress sridevi outstanding preformence in english vinglish

vetern actress sridevi outstanding preformence in english vinglish

vetern actress sridevi outstanding preformence in english vinglish

21.gif

Posted: 08/17/2012 05:25 PM IST
Vetern actress sridevi outstanding preformence in english vinglish

sri_eశ్రీదేవి నటనలో ఎప్పటికీ మహరాణే. ఇదే అంటున్నారు ఆమె చాలాకాలం తర్వాత తెరపై కనిపించబోతోన్న ఇంగ్లీష్ వింగ్లీష్ టీజర్ చూసినవారంతా. ఇంత వయసులోనూ తన నటనలో ఏమాత్రం వన్నె తగ్గలేదని రుజువుచేసిన శ్రీదేవి 1963 ఆగష్టు 13న జన్మించిన శ్రీ దేవి 1967 లో వచ్చిన ‘కందన్ కరునై’ అనే సినిమా ద్వారా తమిళ తెరకు చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమయ్యారు. 1971లో వచ్చిన ‘భార్య బిడ్డలు’ చిత్రం ద్వారా తెలుగు తెరకు కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఎంట్రీ ఇచ్చారు. 1977లో వచ్చిన ‘బంగారక్క’ చిత్రం ద్వారా కథానాయికగా తెలుగు తెరకు సరికొత్త హీరోయిన్ అయ్యారు. ఆ తర్వాత 1978లో వచ్చిన ‘పదహారేళ్ళ వయసు’ చిత్రం శ్రీదేవికి మంచి గుర్తింపు మరియు స్టార్డమ్ తెచ్చిపెట్టింది. 1970 ,1980, 1990 దశకాల్లో అంటే సుమారు మూడు దశాబ్దాల పాటు తెలుగు , తమిళం మరియు బాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు ఆరాధ్య నటిగా మారారు. 1990 నాటికి ఇండియాలోనే ఫేమస్ హీరొయిన్ గా ఎదిగారు ‘సూపర్ స్టార్ శ్రీదేవి’ అనిపించుకున్నారు. పెళ్ళైన తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న శ్రీ దేవి ఈ సంవత్సరం ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ అనే చిత్రం ద్వారా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్ర టీజర్ విడుదలై విపరీతమైన మన్ననలు పొందుతోంది. తెలుగు, ఇంగ్లీష్ వెర్షన్లలో ఉన్న ఈ టీజర్ మీరూ చూసి ఆనందించండి .. ...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sriya hot stills
Colours swathi mollywood entry  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles