Eega movie producers gives help

eega movie producers gives help

eega movie producers gives help

29.gif

Posted: 07/27/2012 03:51 PM IST
Eega movie producers gives help

       ఈగ ఇప్పుడు ఎన్నోపనులు చేసేస్తోంది. ఒకపక్కన అల్టిమేట్ రివెంజ్ తీర్చుకుంటూనే అదే చేత్తో సాయం చేస్తుందికూడా.. విషయం ఏమంటే.. 'ఈగ' సినిమా చూసిన వాళ్లకి అందులో సమంతా వర్క్ చేసిన 'ప్రాజెక్ట్ 511' అనే సంస్థ పేరు తెలిసే ఉంటుంది. ఈ సంస్థ సినిమా eega_eeకోసం క్రియేట్ చేసినది కాదు. హైదరాబాద్ - రంగారెడ్డి జిల్లాలలో నిజంగానే ఇది నిర్వహించబడుతోంది. కనీస వసతులు లేని 511 పాఠశాలలను తీసుకుని, విరాళాల ద్వారా ఆ పాఠశాలలకి సౌకర్యాలను కల్పించడం జరుగుతుంటుంది. సమాజానికి ఉపయోగకరంగా ఉండే ఈ కాన్సెప్ట్ ను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో రాజమౌళి దానిని 'ఈగ' సినిమాలో చూపించారు. ఈ సినిమా లాభాల బాటలో నడిస్తే, ఈ విద్యా సంస్థలకి అవసరమైన వాహన సౌకర్యాన్ని కల్పించాలని అనుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా సాగిపోతుండటంతో, నిర్మాతలతో కలిసి ఈ సంస్థకి 22 లక్షల విరాళాన్ని అందించారు. ఈ సమయంలోనే రోటరీ క్లబ్ వారు కూడా ఈ స్వచ్చంద సంస్థకి తమవంతు సాయాన్ని అందించారు. పోతే, హిందీలో విడుదల చేయనున్న 'ఈగ' చిత్రంలో అభిషేక్ బచ్చన్ నటించడంలేదనీ ఉన్నదున్నట్టు గానే హిందీలోకి డబ్ చేస్తున్నామని రాజమౌళి చెప్పారు. త్వరలోనే ఈ సినిమా అక్కడ 'మక్కీ'పేరుతో విడుదల అవుతుందని అన్నారు. ఇదండీ ఈగ చేసిన సాయం..

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Director krishna vamsi birthday today
Pawanism song coming  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles