Pawan kalyaan new item song for rambabu film

Pawan Kalyaan new item song for Rambabu film.gif

Posted: 06/30/2012 08:04 PM IST
Pawan kalyaan new item song for rambabu film

Scarlet-Wilson

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లోనైనా, బాలీవుడ్ లోనైనా ఐటెం సాంగు లేనిదే సినిమాలు ఉండటం లేదు. ఈ ఐటెం సాంగుల పేరుతో కొత్త కొత్త భామలు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. కొత్తగా వచ్చే ఐటెం భామలే కాకుండా ప్రముఖ హీరోయిన్లు కూడా ఐటెం సాంగులలో నటిస్తున్నారు. ప్రస్తుతం పాపులర్ లో ఉన్న ఐటం సాంగ్ ‘గబ్బర్ సింగ్ ‘ సినిమాలోని ‘‘కెవ్వు కేక’’ ఈ పాటకు ఎంత ప్రజాదరణ వచ్చిందో వేరే చెప్పనక్కర్లేదు. తాజాగా పవన్ కళ్యాణ్ పూరి డైరెక్షన్ లో గంగతో రాంబాబు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కూడా ఓ ఐటెంసాంగ్ పెట్టారని సమాచారం. దానికి మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ మాంచి కిక్కిచ్చేలా మ్యూజిక్ ఇచ్చాడని వార్త. ఈ సినిమా షూటింగు ప్రస్తుతం హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో జరుగుంది.

నిన్న రాత్రి ఈ ఐటెం సాంగును షూట్ చేశారు. ఈ ఐటెం సాంగులో బాలీవుడ్ సినిమా 'షాంఘై' లో ఐటెం పాట చేసి పేరు తెచ్చుకున్న బ్రిటిష్ మోడల్ స్కార్లెట్ విల్సన్, ఇప్పుడు పవన్ కల్యాణ్ తో ఈ ఐటెం సాంగు చేస్తోంది. ఈ సాంగులో మంచి మసాలా ఉంటుందని వార్తలు. స్కార్లెట్ ఇప్పటికే 'ఎవడు' సినిమాలో రామ్ చరణ్ తో ఓ ఐటెం సాంగు చేసింది. మంచి సెక్సీ ఫిజిక్ తో ఆకట్టుకుంటున్న స్కార్లెట్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం అంటున్నారు.

అయితే ఇండస్ట్రీ జనాలు మాత్రం బాబాయి – అబ్బాయి లు ఇద్దరు కలిసి ఒకే ఐటెం పాపను వాడుకుంటున్నారని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gabbar singh makers planning grand function to mark 50 days
Pawan kalyan to remake ek tha tiker  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles