Gabbar singh completes 50 days run in 306 centres

Gabbar Singh completes 50-days run in 306 centres,bandla ganesh,gabbar singh,gabbar singh movie records,gabbar singh stills,gabbar singh wallpapers,megafans,parameswara arts,pawan kalyan,pawanfans,pawanism,records

Gabbar Singh completes 50-days run in 306 centres

Gabbar.gif

Posted: 06/30/2012 12:12 PM IST
Gabbar singh completes 50 days run in 306 centres

Gabbar Singh completes 50-days run in 306 centres పవన్‌కళ్యాణ్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'గబ్బర్‌సింగ్‌' యాభై రోజులు పూర్తిచేసుకుంది. శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై బండ్ల గణేష్‌ నిర్మించారు. గురువారంతో 50 రోజులు పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ...'81 ఏళ్ళ తెలుగు సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించి బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌గా ప్రేక్షకుల అపూర్వ ఆదరణ అందుకుంటున్న పవన్‌కళ్యాణ్‌ గబ్బర్‌సింగ్‌ 306 కేంద్రాల్లో అద్భుతమైన షేర్స్‌తో 50 రోజులు పూర్తి చేసుకుంది. 100 రోజులకు పరుగులు తియ్యడం ఎంతో ఆనందంగా వుంది. నిర్మాతగా నాకు ఈ సంచలన విజయం పెద్ద టర్నింగ్‌ పాయింట్‌ అయింది. ఇంతటి బిగ్గెస్ట్‌ హిట్‌ తీసే అవకాశం ఇచ్చిన మా హీరో పవన్‌కళ్యాణ్‌గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మలేషియాలో తొలిసారిగా తెలుగుసినిమా యాభైరోజులు ఆడడం విశేషం. అలాగే ఆస్ట్రేలియా, అమెరికాలలో అర్థ శతదినోత్సవాన్ని చేరుకుంది. జులై మొదటివారంలో హైదరాబాద్‌లో యాభైరోజుల వేడుకను జరపనున్నా'మని తెలిపారు.

దర్శకుడు హరీష్‌ శంకర్‌ మాట్లాడుతూ...'ఫెయిల్యూర్‌తో స్టార్ట్‌ అయిన నాకు సక్సెస్‌ విలువ తెలుసు. 'గబ్బర్‌సింగ్‌'లాంటి బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ చేసే అవకాశం ఇచ్చిన పవన్‌కళ్యాణ్‌గారికి, నిర్మాత బండ్ల గణేష్‌కు, 'గబ్బర్‌సింగ్‌' విజయం కోసం అహర్నిశలూ కృషి చేసిన మా టీమ్‌ మెంబర్స్‌ ప్రతి ఒక్కరికీ థాంక్స్‌ చెప్తున్నా. షూటింగ్‌లో కుడిచేయికి దెబ్బతగిలినా అనుకున్నటైమ్‌లో సినిమా రావడానికి పవన్‌కళ్యాన్‌ సహకరించారు' అని తెలిపారు.హీరోయిన్‌ శృతి హాసన్‌ మాట్లాడుతూ...'పవన్‌కళ్యాణ్‌లాంటి పెద్ద స్టార్‌తో కలిసి చేసిన 'గబ్బర్‌సింగ్‌' పెద్ద హిట్‌ అవడం సంతోషంగా వుంది. నా కెరీర్‌లో ఇది ఫస్ట్‌ బిగ్గెస్ట్‌ హిట్‌. ఈ అవకాశం ఇచ్చిన పవన్‌కళ్యాణ్‌గారికి, హరీష్‌ శంకర్‌గారికి, నిర్మాత బండ్ల గణేష్‌గారికి థాంక్స్‌' అని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Amy jackson is shankars heroine
Nitin s courier boy kalyan launched  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles