Bollywood beauty priyanka chopra says

bollywood beauty priyanka chopra says...

bollywood beauty priyanka chopra says...

13.gif

Posted: 06/26/2012 07:04 PM IST
Bollywood beauty priyanka chopra says

      తీరు చూస్తుంటే.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సినిమాలన్నీ హోల్ సేల్ గా తనే తీసేసుకున్నట్టు కనిపిస్తోంది బాలీవుడ్ అందాల భామ1eeff ప్రియాంకా చోప్రా. గతంలో అమితాబ్ నటించిన క్లాసిక్స్ ను రీమేక్ చేస్తే కనుక, వాటిలో కచ్చితంగా తానే కథానాయికగా ఉంటానని ప్రియాంకా నమ్మకంగా చెబుతోంది. 'ఇప్పటికే డాన్, అగ్నిపధ్ రీమేక్ అయ్యాయి. వాటిలో చూడండి... నేనే కథానాయికని. ఇప్పుడు రామ్ చరణ్ తో 'జంజీర్' రీమేక్ చేస్తున్నారు. అందులో కూడా నేనే. రేపు మరికొన్ని చేసినా కూడా వాటిలో కూడా నేనే వుంటాను' అంటూ ఇతర హీరోయిన్లని అటు వైపు చూడద్దన్నట్టుగా కచ్చితంగా చెప్పేస్తోంది. 'నేను అమితాబ్ కి పెద్ద అభిమానిని. ఆయన సినిమాల రీమేక్స్ లో నటించగలగడం నా అదృష్టం. ఇప్పుడు చేస్తున్న 'జంజీర్' ద్విభాషా చిత్రం. హిందీతో బాటు తెలుగులో కూడా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో టాలీవుడ్ కి కూడా చేరువవుతాను' అంటోంది ఈ ముద్దుగుమ్మ. ఈ 'జంజీర్' సినిమా షూటింగులో తనకి చరణ్ తెలుగు నేర్పుతుంటే... తాను అతనికి హిందీ నేర్పుతున్నానని నవ్వుతూ చెబుతోంది ప్రియాంకా. అయితే.. వస్తుమార్పిడి సిద్దాంతమన్న మాట..
    1eefff ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా 'ఎవడు' చిత్రం రూపొందుతోందన్న సంగతి తెలిసిందే. సమంతా - ఎమీ జాక్సన్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే  మొదటి షెడ్యూలుని పూర్తి చేసుకుంది. ఆ తరువాత చరణ్ పెళ్లి సందర్భంగా వాయిదా వేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూలు, ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది.  ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'చెర్రీ' చిత్రం షూటింగులో పాల్గొంటోన్న చరణ్, ఈ నెల 28 నుంచి 'ఎవడు' షూటింగుకి హాజరు కానున్నాడు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
     ఇదిలా ఉండగా,  “ఎవడు” చిత్రంలో ఐటం సాంగ్ చేయడానికి సిద్దపడ్డ శ్వేతా భరద్వాజ్ ఈ పాటలో రెచ్చిపోవడానికి సిద్ధపడుతున్నట్టు టాలివుడ్ కథనం. బిజినెస్ మెన్ చిత్రంలో వుయ్ వాంట్ బ్యాడ్ బాయ్స్ అంటూ రెచ్చిపోయిన శ్వేత దానిని మించిన స్కిన్ షో చేయాడానికి సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. బిజినెస్ మెన్ చిత్రంలో ఆమె బోల్డ్ ఎక్స్ ఫోజింగ్ కు ఫిదా అయిన సదరు చిత్ర యూనిట్ ఆమెను తమ ఐటం సాంగ్ కోసం బుక్ చేసుకున్నారట. బిజినెస్ మెన్ చిత్రంలో శ్వేత చేసిన ఎక్స్ ఫోజింగ్ కు సెన్సార్ కత్తెర పడింది. ఆ రేంజ్ లో ఆమె రెచ్చిపోయిన అమ్ముడు ఇప్పుడు ఇంకెంత అంగ ప్రదర్శన చేస్తుందో చూడాలి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Film actress asin new trend
Salaam e ishq song from mere dost picture abhi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles