Aamir trying to rope in rajinikanth for dhoom3

Bollywood, Dhoom 3, Aamir Khan, Rajinikanth

Aamir Khan is reportedly trying to rope in Tamil superstar Rajinikanth for 'Dhoom3'

Aamir trying to rope in Rajinikanth for Dhoom3.gif

Posted: 06/23/2012 01:53 PM IST
Aamir trying to rope in rajinikanth for dhoom3

Rajini_Aamir

అదిరి పోయే కాంబినేషన్ ఒకటి సంభవించబోతోందని బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇవి కార్యరూపం దాలిస్తే అదొక భారత చలన చిత్ర చరిత్రలోనే ఒక సంచలన చిత్రంగా నిలిచిపోతుందనడంలో ఎటువంటి సందేహం ఉండదు. ఆమీర్ ఖాన్- రజనీకాంత్ లు కలిసి ధూమ్ -3 నటించబోతున్నారని బాలీవుడ్ సమాచారం. రజనీ కాంత్ హిందీలో ఇది వరకూ అనేక సినిమాలు చేశాడు. అమితాబ్ , శత్రఘ్న సిన్హ వంటి స్టార్ హీరోలతో మల్టీ స్టారర్ సినిమాల్లో కనిపించాడు. అవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పటికే అనేక సంచలనాలు నమోదు చేసి ధూమ్ సినిమాకు రెండో సీక్వెల్ గా యాష్ రాజ్ ఫిలిమ్స్ తీసుకురాబోతున్న ధూమ్ -3 లో రజనీకాంత్ నటించబోతున్నాడు అని సిని వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపుతోంది.

ఇప్పటికే ఈ సినిమాలో ఆమీర్ ఖాన్ నటించబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో తనతో పాటు నటించమని ఆమీర్ ప్రత్యేకంగా సూపర్ స్టార్ ను రిక్వస్ట్ చేశాడని అంటున్నారు. ఈ విషయంలో నిర్మాతలను వాకబు చేస్తే వారు కూడా అవుననే అన్నారు. రజనీతో కలిసి నటించడానికి ఆమీర్ చాలా ఆసక్తితో ఉన్నాడని, దీనికి రజనీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెనువెంటనే ధూమ్ -3 సెట్స్ పై కి వెళ్తుందని అంటున్నారు. అటు రజనీ కాంత్ కు, ఆమీర్ ఖాన్ కు దేశ విదేశాల్లో ఉన్న క్రేజ్ నేపథ్యంలో వీరిద్దరూ ధూమ్ -3 వంటి స్టైలిష్ ప్రాజెక్టు చేస్తే బాక్సాఫీసు బద్దలు కావడం ఖాయం!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Namrata shirodkar banks on cordlife
Allu arjun to act in rajesh m bilingual  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles