Allu arvind comment

allu arvind comment

allu arvind comment

7.gif

Posted: 06/11/2012 08:00 PM IST
Allu arvind comment

      జులాయి ఆడియో ఫంక్షన్లో అల్లు అరవింద్ చేసిన ప్రసంగం అందరినీ ఆశ్చ్యర్యానికి గురిచేసి అనంతరం నవ్వించింది.22 అంతేకాదు.. దర్శకుడు త్రివిక్రమ్ తదితరులైతే రెండు చేతులతోనూ నోరు మూసుకుని మరీ విస్మయం చెందారు. అంతలోనే తేరుకుని పగలబడి నవ్వుకున్నారు. ఇంతకీ ఏమిటా సంగతి అంటే.. అల్లు అర్జున్ ని ఉద్దేశించి అరవింద్ ‘జులాయి నాకొడుకు’ అని సంబోధించటమే..
    అనంతరం నాకొడుకే కదా ఇలా అనటంలో తప్పులేదనుకుంటాను అని కూడా అరవింద్ వివరణ ఇచ్చుకున్నారు. తర్వాత  బన్నీ సినిమా టైటిల్ జులాయిలా బాధ్యతా రాహిత్యంగా ఉండడని కితాబిచ్చారుకూడా. కష్టపడే మనస్తత్వం అర్జున్ కు ఉందని వెల్లడించాడు.222 ఆసమయంలో అర్జున్ తండ్రిని ఒకింత తన్మయత్వంతో  చూస్తూ చూపులతోనే థాంక్స్ చెప్పాడు. అనంతరం దర్శక రత్న దాసరి మాట్లాడుతూ బన్నీ తొలిసినిమా గంగోత్రి చూసి వీడు కామెడీ హీరో అవుతాడా, ఫ్యామిలీ హీరో అవుతాడా లేక.. తన కంటూ ఓ ప్రత్యేక కేటగిరీ ఏర్పరుచుకుంటాడా అన్న మీమాంశ నాకు తలెత్తింది. అనుకున్నట్టుగానే ఓ సపరేట్ రూట్ అల్లు అర్జున్ ఏర్పాటు చేసుకున్నాడని దాసరి వ్యాఖ్యానించారు.  అల్లు అర్జున్ ఇంట్లో చాలా బాధ్యతతో వ్యవహరిస్తాడని చిరు మేనళ్లుడు సాయి ధరమ్ తేజ అన్నాడు. 
       ఇక ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ మీద  హీరో అల్లు అర్జున్, అన్న నాగబాబు ప్రసంశల వర్షం కురిపించారు. బన్నీ మాట్లాడుతూ 'మామూలుగా హీరోల మనసులో ఈర్ష్య అనేది వుంటుంది. కానీ, పవన్ మనసులో అదేమీ వుండదు. ఓసారి ఒక హీరో సినిమా ఫ్లాపవడంతో నేను చాలా హ్యాపీ ఫీలయ్యాను. అది చూసి పవన్ కల్యాణ్... అది చాలా తప్పని హితవు పలికాడు అలాంటి మనస్తత్వం అతనిది' అన్నాడు. ఫైట్లు, డాన్సులు గొప్పగా చేసినంత మాత్రాన, పెద్ద పెద్ద డైలాగులు అలవోకగా వల్లించినంత మాత్రాన ఎవరూ పెద్ద స్టార్లు అయిపోరు. ఇక్కడ ప్రవర్తన ముఖ్యం. ఈ మధ్య హిట్ అనిపించుకున్న ఏ సినిమా పోస్టర్ చూసినా ఆల్‌టైమ్ రికార్ట్ అని కనిపిస్తుంది. కానీ ‘గబ్బర్ సింగ్’ పోస్టర్‌లో మాత్రం ఆ అక్షరాలు కనిపించవు. ఎందుకంటే... పవన్‌కళ్యాణ్‌కి అభద్రతాభావం లేదు. నా దృష్టిలో రియల్‌స్టార్ అంటే పవర్‌స్టారే. పవన్‌కళ్యాణ్ రావడం వల్ల ఈ వేడుక కొత్త కళను సంతరించుకుంది.  పవన్ కళ్యాణ్ అతనికి అతనే పోటీ అని, అతను నిజజీవితంలోనే రియల్ స్టార్ అని బన్నీ కీర్తించాడు.2222
      ఇక నాగబాబు అయితే. ఇంతకుముందెన్నడూ నాకు పవన్ గురించి మాట్లాడే అవకాశం రాలేదని, పెద్దగా నటన, డ్యాన్స్, అభినయం చేయకపోయినా పవన్ కళ్యాణ్ అంటే అందరికీ ఎందుకింత అభిమానమో అర్థంకాదని అన్నారు. ఈ ప్రేమకు కారణం పవన్ కళ్యాణ్ మనస్తత్వమే కారణమని, పవన్ ఒక మంచి వ్యక్తని వెల్లడించారు. ఐ లవ్ యూ పవన్ కళ్యాణ్ అని తన ప్రసంగాన్ని ముగించి అందరినీ ఆకట్టుకున్నాడు. పెళ్లి పనుల్లో వుండి వేడుకకు రాలేకపోయాననీ, సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాననీ ఆన్ లైన్ లో మాట్లాడిన రామ్ చరణ్ ఆకాంక్షించాడు.
        ఇదిలా ఉండగా, పవన్ కళ్యాణ్ రాబోయే కొత్ సినిమా గురించి తాజా వార్త...   ఆమధ్య పవన్ కల్యాణ్ హీరోగా విష్ణువర్ధన్ దర్శకత్వంలో వచ్చిన 'పంజా' సినిమా పరాజయం పాలైన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని నిర్మించిన సంఘమిత్రా ఆర్ట్స్ అధినేతలకు లిఫ్ట్ ఇచ్చే ఉద్దేశంతో, పవన్ కల్యాణ్ మరో చిత్రాన్ని చేస్తున్నట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తాను కమిట్ అయిన ప్రాజక్టును పవన్ ఈ సంస్థకు చేస్తున్నారట. ఇందులో కథానాయికగా నటించడానికి ఇలియానా ఇటీవలే సైన్ చేసింది. త్వరలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తాను చేయనున్న 'కెమెరామేన్ గంగతో రాంబాబు' చిత్రం పూర్తయిన వెంటనే ఈ చిత్రం మొదలవుతుందని అంటున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Panic incident in charan wedding sangeeth
Akkineni trayam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles