Sobhan babu bithday celebrations

sobhan babu bithday celebrations

sobhan babu bithday celebrations

19.gif

Posted: 06/11/2012 06:13 PM IST
Sobhan babu bithday celebrations

      గొప్ప కళాకారుడు, క్రీడాకారుడు మరణించిన తర్వాత కూడా గుర్తిండిపోతాడు. పున:స్మరణ ద్వారా మనం వారిని గౌరవించాలి. అది గొప్ప సంస్కృతి...అంటూ దాసరి నారాయణరావు శోభన్‌బాబు గురించి వ్యాఖ్యానించారు. నటభూషణ శోభన్‌బాబు 75 సంవత్సరాల జయంతి వేడుకలు ఈనెల 30 శిల్పకళాతోరణంలో నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల బ్రోచర్‌ను ఫిలిం చాంబర్ లో డి.రామానాయుడు ఆవిష్కరించారు. sf
      శోభన్‌బాబు అభిమాన కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధి దాసరినారాయణ రావు మాట్లాడుతూ...శోభన్ బాబు 97 సంవత్సరాలు బతుకుతా అనేవారు. అలాంటి క్రమశిక్షణ గల వ్యక్తి అర్థంతరంగా మరణించడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన కాంస్య విగ్రహాలు రాజమండ్రి, కర్నూలులో పెడుతున్నప్పుడు వేలాదిగా తరలివచ్చారు. ఇంత అభిమానం ఉందా అనిపించింది. అందుకే ఆయన అబిమానులు 24 జిలాల్లనుంచి వచ్చి నన్ను అడిగారు. ఈ కమిటీద్వారా ఆయన 75 సంవత్సరాలు గుర్తుగా.. 75 మంది పేదకళాకారులను ఆదుకోవాలని ఒక్కొక్కరికి 10వేల చొప్పున ఆర్థికాసాయం చేస్తున్నాం. ఇదంతా కమిటీ స్వంత ఖర్చులతో అభిమానంతో చేస్తున్నదే. అసలు ఆయన వారసులు వీరే'అని చెప్పారు.
     ఈ సమావేశంలో తమ్మారెడ్డి భరద్వాజ, రేలంగినరసింహరావు, రావీమూవీస్ నరసింహరావు, సురేష్‌కొండేటి. ఆహ్వానకమిటీ కన్వీనర్లు- ఎం. సుధాకర్‌బాబు, బి. బాలసుబ్రహ్మణ్యం,టి. సాయికామరాజు, జి.జవహర్‌ బాబు, పి.విశ్రీనివాసరావు, పిపిజిబాబు, యు.విజరు,ఎస్‌ .విశ్వనాత్‌, బి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Allu arvind party
Vips at julayi audio function  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles