Pawan kalyan will attend julayi audio function

pawan kalyan will attend julayi audio function..

pawan kalyan will attend julayi audio function..

5.gif

Posted: 05/22/2012 01:03 PM IST
Pawan kalyan will attend julayi audio function

     pawa_in తన ఫ్రెండ్ ఆడియో వేడుకకు హాజరు కావాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సినిమా వేడుకలకి దూరంగా వుండే పవన్ కల్యాణ్, త్వరలో జరుగబోయే ‘జులాయి’ ఆడియో వేడుకకి హాజరవుతున్నట్టు సమాచారం. అల్లు అర్జున్ - ఇలియానా జంటగా నటించిన 'జులాయి' చిత్రం ఆడియో వేడుకకి ఆయన ముఖ్య అతిధిగా విచ్చేస్తున్నారట. ఈ నెల 25 న హైదరాబాద్ లో ఈ వేడుక ఘనంగా జరుగనుంది.
      ఈ సినిమాకి త్రివిక్రం శ్రీనివాస్ దర్శకుడిగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఆయనకీ, పవన్ కల్యాణ్ కి మధ్య మంచి స్నేహం ఉన్న కారణంగానే ఈ వేడుకకి పవన్ హాజరు అవుతున్నాడని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే కనుక, పవన్ కల్యాణ్ అభిమానులు ఆయన్ని మరోసారి వేదికపై చూడొచ్చు.
      tri'గబ్బర్ సింగ్' సినిమా పాటలతో యూత్ ని ఉర్రూతలూపిన దేవిశ్రీ ప్రసాద్ 'జులాయి' సినిమాకి కూడా స్వరాలను అందించారు. ఇప్పటికే ఈ సినిమా పస్ట్ లుక్ తో బన్నీ అభిమానుల్లో ఆనందం అవధులు దాటుతుంది. ఇక పాటలు ఏమేరకు కుర్రకారును ఉర్రూతలూగిస్తాయో చూడాలి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Daruvu movie release on 25th may
Ravi teja and kajal combi repeat  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles