Adhinayakudu movie release date conformed

adhinayakudu movie release date conformed

adhinayakudu movie release date conformed

1.gif

Posted: 05/22/2012 12:50 PM IST
Adhinayakudu movie release date conformed

       అధినాయకుడు బాలారిష్టాలు దాటి మొత్తం మీద తెరపైకి వచ్చేందుకు సమాయత్తమవుతున్నాడు. ఆర్ధిక పరమైన ఇబ్బందుల నుంచి బైటపడిన 'అధినాయకుడు' ఈ నెల 31 న ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. adhi_eబాలకృష్ణ త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో జయసుధ, లక్ష్మీరాయ్, సలోని కథానాయికలుగా కనిపించనున్నారు. పరుచూరి మురళి దర్శకత్వంలో ఎం.ఎల్.కుమార్ చౌదరి భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. అయితే అనుకోకుండా బడ్జెట్  పెరిగిపోవడంతో, నిర్మాత ఆర్ధిక పరమైన ఇబ్బందుల్లో పడ్డారు. ఫలితంగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ అభిమానుల సహనాన్ని పరీక్షించింది. అయితే,  తాజాగా అందిన సమాచారం ప్రకారం, దాసరి నారాయణరావు జోక్యంతో ఈ సినిమా ఆర్ధిక పరమైన సమస్యల నుంచి  బైటపడిందని తెలుస్తోంది. అనుకోకుండా జరిగిన ఆలస్యం ఈ సినిమా పై ప్రభావం చూపే అవకాశముందనీ, ఒకవేళ సినిమా బాగుంటే ఆ ఎఫ్ఫెక్ట్  అంతగా ఉండక పోవచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా చిత్ర నిర్మాతను కష్టాల కడలినుంచి బయటపడేస్తుందో లేదో చూడాలి.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ravi teja and kajal combi repeat
Rajani shankar combi coming  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles