Old actress kanchana life on silver screen

old actress kanchana life on silver screen

old actress kanchana life on silver screen

7.gif

Posted: 04/27/2012 04:17 PM IST
Old actress kanchana life on silver screen

          తెలుగు శృంగారతార సిల్క్ స్మిత కథ ఇటీవల 'డర్టీ పిక్చర్' పేరిట బాలీవుడ్ లో వెండితెరకెక్కి సంచలన విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే. ఇదే కోవలో ప్రస్తుతం బాలీవుడ్ లో తెరకెక్కుతున్న 'హీరోయిన్' చిత్రం కథ కూడా మరో తెలుగుతార జీవిత కథే.  తన అసమాన ప్రతిభా పాటవాలతో నిన్నటి తరం ప్రేక్షకులను ఉర్రూతలూగించిన కాంచన జీవితం ఆధారంగానే ఈ 'హీరోయిన్' సినిమా రూపొందుతోంది.
         kanch_innఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తూ, హఠాత్తుగా  ఈ రంగుల ప్రపంచంలోకి వచ్చిన కాంచన మొదట్లో అభినయ ప్రాధాన్యత వున్న పాత్రలే చేసినప్పటికీ, తదనంతర కాలంలో గ్లామర్ రోల్స్ కూడా చేసింది. పలు చిత్రాలలో నటించి, తెలుగు ప్రేక్షకుల హృదయాలు దోచుకున్న కాంచన ఆ తర్వాత ఒక్కసారిగా కనుమరుగైంది. అయితే, కుటుంబీకులే ఆమె ఆస్తిని కాజేసి ఆమెను మానసికంగా హింసించడం వల్ల తన రక్త సంబంధీకులపై విరక్తి పెంచుకుని, తన కోట్లాది విలువైన ఆస్తిని ఇటీవల టీటీడీ కి రాసిచ్చేసింది.
       ఈ కథకు కాస్త మసాలా జోడించి దర్శకుడు మాధుర్ బండార్కర్ 'హీరోయిన్' చిత్రంగా మలుస్తున్నాడు. ఇందులో కరీనా కపూర్ అద్భుత నటనను వీక్షించే అవకాశం ఉంది. 

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Madhuri deekshit second innings start
May second weak kaarti movie sekuni movie audio release  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles