Pawan kalyan new movie with tamanna

pawan kalyan, new movie ,with tamanna

pawan kalyan new movie with tamanna

9.gif

Posted: 03/27/2012 05:35 PM IST
Pawan kalyan new movie with tamanna

         Pawan-Kalyan-attending-ishq-audioపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన కెమెరా పట్టుకు తిరిగే అమ్మాయి ఎవరని కొంత కాలంగా ఎదురుచూస్తోన్న సినీ అభిమానుల అనుమానం తీరిపోయింది. అదే  పవన్ కల్యాణ్ కథానాయకుడుగా పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న 'కెమెరామేన్ గంగతో రాంబాబు' చిత్రంలో కథానాయికగా చాలా మందిని పరిశీలించి, చివరికి మిల్కీ వైట్ భామ తమన్నాను ఖరారు చేశారు. ఈ విషయాన్ని తాజాగా పూరి జగన్నాథ్ తెలిపాడు.
         పవన్ కల్యాణ్ సినిమాలో కథానాయికగా అంటే, గంగగా తమన్నా నటిస్తోంది. పన్నెండేళ్ల తర్వాత పవన్ కల్యాణ్ తో చేస్తున్న సినిమా కాబట్టి ఇది ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఆత్రంగా వుంది అంటున్నాడు పూరీ జగన్నాద్. taman_inn
విశేషమేమిటంటే, రామ్ చరణ్ తో తాజాగా 'రచ్చ' సినిమాలో నటిస్తున్న తమన్నా, అటు బాబాయ్ తో కూడా నటించే అవకాశాన్ని పొందుతోందన్న మాట. ఇక ఈ కెమెరా మెన్ను, రిపోర్టర్ ఏ సంచలనాలకు కేంద్రబిందువవుతారో కూడా పూరీనే చెప్పాలి.

           సూర్యదేవర రాధాకృష్ణ సమర్పణలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే రెండో వారంలో రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే ఈ సినిమాని అక్టోబర్ 18న విడుదల చేయాలనేది నిర్మాత సంకల్పం.          

           ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి తారాగణమైన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, కూర్పు: ఎస్.ఆర్. శేఖర్, ఫైట్స్: విజయ్, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bala krishna adhinayakudu movie coming soon
Tamanna looking nice in rachha movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles