Vennela one and half audio function

vennela one and half ,audio, function,

vennela one and half audio function

4.gif

Posted: 02/07/2012 12:45 PM IST
Vennela one and half audio function

Vennala_Audio_launch_2చైతన్య కృష్ణ, మోనాల్ గజ్జర్ ప్రధానపాత్రధారులుగా జి.ఆర్8 ప్రొడక్షన్స్ పతాకంపై వెన్నెల కిషోర్ దర్శకత్వంలో వాసు వర్మ నిర్మిస్తున్న చిత్రం ‘వెన్నెల 1 1/2’. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని, నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. సినిమాలోని పాటలు ఆదిత్య మ్యూజిక్స్ ద్వారా మార్కెట్‌లోకి విడుదలయ్యాయి. ఆడియో సీడీని దర్శకుడు వి.వి.వినాయక్ ఆవిష్కరించి, తొలి సీడీని నారా రోహిత్‌కు అందించారు.

 Vennala_Audio_launchఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ‘వెన్నెల’ కిషోర్ మాట్లాడుతూ సంగీత దర్శకుడు సునీల్ కాశ్యప్ మంచి బాణీలను అందించారని పాటలన్నీ బాగా వచ్చాయని చెప్పారు. నిర్మాత వాసు మాట్లాడుతూ ‘వెన్నెల’ ఫస్టాఫ్ కు సీక్వెల్‌గా ఈ చిత్రం ఉంటుందని, చిత్రం చూస్తున్నంతసేపు ప్రేక్షకులు నవ్వుతూనే వుంటారన్నారు.

ఈ కార్యక్రమంలో దర్శకుడు దేవాకట్ట ట్రైలర్స్ విడుదల చేశారు. మంచుమనోజ్, వరుణ్‌సందేశ్, మధురిమ, అవసరాల శ్రీనివాస్, చక్రవర్తి, సామ్రాట్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం ఆధ్యంతం సందడిగా సాగింది.

బ్రహ్మానందం, రఘుబాబు, శ్రావణ్, గిరిధర్, మాస్టర్ భరత్, తాగుబోతు రమేష్, హరీష్ కోయిలగుండ్ల, మధు, ఆగ్నిస్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సురేష్‌భార్గవ్, ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల, పాటలు: కృష్ణచైతన్య, సిరాశ్రీ, శ్రీమణి, నిర్మాతలు: వాసు వర్మ, రచన, దర్శకత్వం: వెన్నెల కిషోర్.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  S janaki background singer
Allari naresh new socio fantacy movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles