Jr ntr dhammu first look on sankranti

Dhammu First Look on Sankranti, Jr NTR Dhammu, Jr Ntr Dhammu first look, dhammu first look, Dhammu Jr Ntr Movie, Dhammu telugu movie jr ntr,andhra wishesh

Jr NTR Dhammu First Look on Sankranti

Dhammu.gif

Posted: 01/06/2012 12:21 PM IST
Jr ntr dhammu first look on sankranti

Jr Ntr Dhammu First Look on Sankranti 

        హీరోయిన్ పాత్ర చాలా కీలక మైన `ఊసరవెల్లి` మూవీకి సై చెప్పి తన బ్రాడ్ మైండ్ ని ప్రేక్షకుల ముందుంచిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం `దమ్ము`. నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుపుకుంటున్న ఈ చిత్రం షెడ్యూల్ కంటే          ముందుగానే ప్రేక్షకుల ముందుకు రావాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందుకు చిత్రయూనిట్ చాలా ఉత్సాహంగా పనిచేయటమే కారణం.

          ప్రస్తుతం భాగ్యనగర పరిసరాల్లో షూటింగ్ జరుపుకుంటున్న `దమ్ము` జనవరి 26 నుంచి పొలాచ్చిలో పాగా వేయనుంది. ఇంతకుముందు అక్కడ వాతావరణం అనుకూలించక యూనిట్ పొలాచ్చి నుంచి వెనుదిరిగిన సంగతి మనకి తెలుసు.

          అపజయమెరుగని బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న `దమ్ము` చిత్రాన్ని అలగ్జాండర్ వల్లభ నిర్మిస్తుండగా,  సుప్రసిద్ధ క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కే.ఎస్. రామారావు సమర్పిస్తున్నారు. సంగీతం కీరవాణి.

          యంగ్ టైగర్ తో త్రిష జోడీకడుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ సంక్రాంతికి విడుదల చేస్తారు. ఫిబ్రవరి రెండోవారానికి టాకీపార్ట్ పూర్తి చేసి, ఏప్రిల్ కంటే ముందుగానే భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.    

                                                                                                          -  నారాయణ ఆనాల

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sri rama rajyam 50 days successmeet
Business man will be a big hit  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles